నవ్యంద్రలో రాజధాని అభివృద్ధి రాజధాని అభివృద్ధి అంటూ గత 5 సంవత్సరాలు ప్రజలకు టోపీ పెట్టాడు చంద్రన్న. రాష్ట్ర విభజనా తర్వాత నవ్యంధ్రకు ఒక రాజధానిని నిర్మించేందుకు రాజకీయాలు చేస్తున్నారు రాజకీయ నాయకులూ. పార్టీ మారినప్పుడల్లా రాజధాని మారుతుంది ఏమో అని అనిపించేలా చేస్తూన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులూ.                          


ఈ నేపథ్యంలోనే నవ్యంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయం చేసి దొనకొండాలో ఉండాల్సిన రాజధానిని అమరావతికి చేర్చి గత అయుదు సంవత్సరాలు రాజకీయం చేశాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర అభివృద్ధి కోసం నవ్యంధ్రకు రాజధానిగా దొనకొండను ఎంపిక చేస్తే అతని స్వార్థం కోసం వరద ముంపు ప్రాంతం అమరావతిని రాజధాని చేసి ఆర్ధిక రాజకీయాలు చేశాడు చంద్రబాబు నాయుడు.                     


అయన అవినీతి రాజకీయానికి స్వస్తి పలుకుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒకే రకమైన వార్తలు వినిపిస్తున్నాయి. రాజధాని మార్పు రాజధాని మార్పు అని. వీటికి ప్రాణం పోస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.                               


మరి నిజంగా రాజధానిని మారుస్తారా లేక ఇవి కేవలం ఊహలకు మాత్రమే అంకితమా అనేది తెలియాలంటే యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించే వరుకు ఆగాల్సిందే. అయితే ఈ వార్తపై ప్రతిపక్ష నేతల నుండి భారీగా విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విమర్శలపై కొత్త ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: