టిఎన్‌ ఎస్‌ ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. బ్రహ్మం రూపొందించిన యాంటీ ర్యాగింగ్‌ పోస్టర్‌ను టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్ర బాబునాయుడుగారు గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లూడుతూ... అన్ని యూనివర్శిటీలు, కాలేజీలల్లో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహనా సదస్సులు, ర్యాలీలు నిర్వహించి విద్యార్థులను చైతన్యపరుస్తూ, ర్యాగింగ్‌ చట్టాలపై అవగాహన కలిగించాలని సూచించారు. 

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే యాంటీ ర్యాగింగ్‌ చట్టాలను పటిష్టపరిచామని, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్శిటీలైన ఎస్‌ఆర్‌ఎం, విట్‌, అమృత లాంటి యూనివర్శిటీలను అమరావతికి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశానిదేనన్నారు.

 ఈరోజు మన రాష్ట్రం విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు పొందేలాగ కృషి చేశామన్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో అన్ని విద్యార్థి సంఘాల కంటే ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జాతీయ సమన్వయ కమిటి సభ్యులు ఆలూరి రాజేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు మన్నం వంశి, రాష్ట్ర నాయకులు బిక్కు నాయక్‌, నగర అధ్యక్షులు పి. నవీన్‌, మరియు వివిధ యూనివర్శిటీల విద్యార్థులు పాల్గొన్నారు. 


టిఎన్‌ ఎస్‌ ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ బ్రహ్మం మాట్లాడుతూ..  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజులు కడతామని ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిన జగన్‌ ఇప్పుడు ఫీజులడిగితే కొడతామంటున్నారని ఉపకార వేతనాలు, ఫీజురీయంబర్స్‌మెంట్‌ చెల్లించమని విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ ముందు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపైన పోలీసులు లాఠీ ఛార్జి చేసి నడ్డి విరగ్గొట్టారని, అంతేకాకుండా నడ్డి విరగ్గొట్టారని, అడిగిన పాపానికి అమాయక విద్యార్థులపైన తప్పుడు కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఒంటిమీద పడిన ప్రతి లాఠీ దెబ్బ వారి తల్లిదండ్రుల గుండెలపై వైసీపీ చేస్తున్న గాయంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారని బ్రహ్మం చౌదరి పేర్కొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: