7-9-19 వ తేదీన ప్రతీ ఒక్కరు వారు ఎన్ని వాట్సప్ గ్రూపులలో ఉన్నారో అన్ని వాట్సప్ గ్రూపుల లోను,అంతకు మించి పర్సనల్ గాను ప్రతీ ఒక్కరికి వచ్చిన వీడియో భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఇస్రో చైర్మన్ శ్రీ కైలాసవాసి శివన్ ను చంద్రయాన్ లాండ్ రోవర్ మాత్రమే విఫలమైన సందర్భంలో శివన్ కు ఒక స్పందన,ఒక ఊరట,ఒక ఓదార్పు ఇస్తున్న వీడియో.

 

ఆ వీడియోలో శ్రీ కైలాసవాసి శివన్  ప్రపంచంలో అత్యున్నత శాస్త్రవేత్తల సమూహానికి సారధ్యం వహిస్తున్న ప్రసిద్ధ సాంకేతిక శాస్త్రవేత్త ఐక చిన్న పిల్లవానిగా కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు.

అతడు ఎందుకలా ఏడవాలి

అవును ఒక సాంకేతిక సమస్యతో ఆ రోవర్ సిగ్నల్ పనిచేయలేదు.ఐతే ఏమిటి ఒక వేయి కోట్లకు ప్రధాని ఒక్క సంతకం పెడితే తిరిగి 6 నెలలలో చంద్రుడిపై మన యానం విజయవంత మవుతుంది.

 

ఎందుకు భారత ప్రధాని రష్యా నుండి వచ్చిన వెంటనే కైలాసవాసిని కలిసి ఊరడించాలి.

ఒక ఫోన్ చేస్తే చాలుకదా!

ఏడ్చి పెడబొబ్బలు పెట్టకపోతే

కైలాసవాసి శివన్ కు ఉద్యోగం పోతుందా?

ఇంక్రిమెంట్ రాదా?

భార్య విడాకులు ఇస్తుందా?

జీతం ఏమైనా తగ్గిపోతుందా?

ఓదార్చడానికి వెళ్ళక పోతే ప్రధాని మోడిని ఎందుకు వెళ్ళలేదని ఎవరైనా అడుగుతారా?

ప్రధాని పదవి పీకేస్తారా?

ప్రతి పక్షాలు భారత బంద్ కు పిలుపిస్తాయా?

ఇవి ఏవి కారణాలు కాదుకదా

వారిరువురికి ప్రత్యక్షంగా వచ్చే నష్టం ఏమీ లేదుకదా?

మరి ఎందుకు అంత సీన్

అది వెర్బల్ కమ్యూనికేషన్ గా గంటల గంటల ఉపన్యాసించినా,పేజీల పేజీల వ్యాసాలలో రచించినా అర్ధం కాని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్.

దాని పేరే అంకిత భావం.

 

రష్యా దేశం 12 ప్రయత్నాలు చేసింది,ప్రపంచానికి పెద్దన్న అమెరికా 7 ప్రయత్నాలు చేసింది.కానీ భవ్య భారత్,దివ్య భారత్ మొదటి ప్రయత్నంలోనే 99% విజయం సాధించింది.చంద్రయాన్ 2ఉపగ్రహం కక్ష్య లో ఒక సంవత్సరం విజయవంతంగా పరిభ్రమిస్తుంది.కేవలం 14 రోజులు ఉండే రోవర్ మాత్రమే సిగ్నల్ కోల్పోయింది.

 

ఆ ఏడుపు వెనుక ఒక దేశం లక్ష్యం ఉంది.ఒక పరువుంది.ఒక పదవుంది.ఒక బరువుంది.ఒక భక్తి ఉంది.ఒక నిరంతర శ్రమ ఉంది.అనేక మంది అంతులేని కృషి ఉంది.

 

ప్రతీ మనిషి పన్ను రూపంలో కట్టే రూపాయి విలువుంది. చిరకాల వాంచ ఉంది.విజయం వలన వచ్చే దేశ కీర్తి పతాక రెపరెపల మధుర శబ్దం ఉంది.

ప్రపంచ ప్రజల ఉజ్ఞ్వల జయ జయ కరచాల చప్పట్ల ధ్వని ఉంది.ఆ ఊరట వెనుక ఒక నాయకుడు,ఒక మార్గదర్శకుడు,ఒక పథ నిర్థేశకుడు,ఒక రాజు,ఒక యజమాని,ఒక పెద్ద,ఒక ప్రధాని ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అని రాబోయే కాలంలో చెప్పుకునే ఉదాహరణ ఉంది

సక్సెస్ ఐతే నా సమర్ధత విఫలమైతే నీ అసమర్ధత

అనే మనుషులకు గొప్ప ఆదర్శం ఈ నర ఇంద్ర మోదీ, కైలాసవాసి శివన్ లా ఏడుపు అంతరార్థం.

మరింత సమాచారం తెలుసుకోండి: