జులై 22వ తేదీ నుంచి ఇస్రో శాత్రవేత్తలకు నిద్ర కరువైంది.  మిషన్ చంద్రయాన్ 2 కోసం ఎన్నో రోజులు కష్టపడి రూపొందించిన మిషన్ జులై 22 వ తేదీన విజయవంతంగా లాంచ్ చేశారు.  మార్క్ 3 రాకెట్ చంద్రయాన్ 2 ను మోసుకెళ్లి సరైనకక్ష్యలో వదిలిపెట్టింది.  అక్కడి నుంచి ఆర్బిటర్.. ల్యాండర్ లు కలిసి ప్రయాణం చేశాయి.  చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది.  


ల్యాండర్ ల్యాండింగ్ సమయంలో ఇస్రో తో పాటు ఇండియా మొత్తం నిద్రపోకుండా ఎదురుచూసింది.  అయితే, చివరి నిమిషంలో ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయాయి.  విక్రమ్ ఏమైందో తెలియలేదు.  విక్రమ్ జాడకోసం ఇస్రో శాస్త్రవేత్తలు సెర్చ్ చేస్తున్నారు.  ఆర్బిటర్ అందిస్తున్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.  ఒకవేళ ల్యాండర్ అక్కడ సక్రమంగా దిగి ఉంటె..14 రోజులపాటు మాత్రమే పనిచేస్తుంది.  ఆ తరువాత దక్షిణ దృవంలో చీకటి అలుముకుంటుంది.  దాదాపు 14 రోజులపాటు కటికచీకటి .. వాతావరణం మైనస్ 248 డిగ్రీలు ఉంటుంది.  అంటే మంచు రాయిలా మారుతుంది.  


ఆ తరువాత అక్టోబర్ 5 లేదా 6 వ తేదీల్లో మరలా సూర్యకిరణాలు చంద్రుడిని తాకుతాయి.  అప్పుడు తిరిగి మామూలు స్థితికి వస్తుంది.  అందుకే రోవర్ కు, ల్యాండర్ జీవిత కాలం కేవలం 14 రోజులే నిర్ణయించారు. అయితే, అనుకోని అవాంతరాల కారణంగా ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయాయి.  ఒకవేళ ల్యాండర్ సవ్యంగా దిగి.. బ్యాటరీలు రీఛార్జ్ అయితే.. సమాచారం భూమి మీదకు పంపుతుంది.  


దానికోసమే అందరు ఎదురు చూస్తున్నారు.  సెప్టెంబర్ 20 వ తేదీ వరకు సమయం ఉన్నది కాబట్టి ల్యాండర్ జాడ తెలుస్తుందని ఎదురు చూస్తున్నారు.  జాడను కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాం.  ఒకవేళ ల్యాండర్ తిరిగి పనిచేయడం మొదలుపెడితే.. అది ఓ అద్భుతం అని చెప్పాలి.. ఇప్పటి వరకు విమర్శలు చేస్తూ వచ్చిన వాళ్లకు ఇదొక చెంపదెబ్బలాంటిది అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: