తెరాస పార్టీ తన మంత్రి వర్గాన్ని విస్తరించింది.  నిన్న సాయంత్రం కొత్తగా  ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.  రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ తమిళ్ ఇసై ఈ ఆరుగురు మంత్రులతో ప్రమాణం చేయించింది.  ఇందులో కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ లు ఉన్నారు.  అనుకున్నట్టుగానే కేటీఆర్ కు తిరిగి మంత్రి పదవి ఇచ్చారు.  


తెరాస పార్టీకి మజ్లీస్ పార్టీకి మధ్య మంచి అనుబంధం ఉన్నది.  రెండు పార్టీలు కలిసి పోటీ చేయకపోయినా మంచి అవగాహనతో ముందుకు వెళ్తున్నారు.  ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు.  ఇటీవలే హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కంపెనీలు వస్తున్నాయి.  భారీ పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ లో వారి కార్యాలయాలు నిర్మించుకుంటున్నాయి.  


అలా వచ్చిన వాటిల్లో ఒకటి అమెజాన్ కంపెనీ.  ఈ బిల్డింగ్ నిర్మాణం సమయంలో ఓ వ్యక్తి ట్విట్టర్ లో కేటీఆర్ గురించి పొగుడుతూ ట్వీట్ చేశారు.  కాగా, దానికి మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ స్పందించి కేటీఆర్ హయాంలో హైదరాబాద్ ఐటి రంగంలో అభివృద్ధి చెందుతుందని.. కేటీఆర్ ను తిరిగి ఐటి మంత్రిగా చూడాలని అనుకుంటున్నట్టు ఆరోజున ట్విట్టర్ లో పేర్కొన్నారు.  


అసదుద్దీన్ కోరిన కోరికను కెసిఆర్ నిన్న తీర్చారు.  తిరిగి కేటీఆర్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవడమే కాకుండా, గతంలో ఇచ్చిన శాఖలను తిరిగి అప్పగించారు.  తన ఫ్రెండ్ కోరికను ఇప్పుడు ఇలా తీర్చినట్టయింది.  అయితే, హరీష్ రావును మంత్రి వర్గంలోకి తీసుకోవడం వెనుక బీజేపీ దూకుడు కారణం అని తెలుస్తోంది.  బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు పావులు కదుపుతున్న సమయంలో, హరీష్ రావు అవసరం ఉందని భావించిన కెసిఆర్ ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారని కొందరి వాదన. 


మరింత సమాచారం తెలుసుకోండి: