ఎవడైన ఇంటికి దొంగతనానికి వస్తే ఏం చేస్తాడు.ఏంచక్కా దొరికిన కాడికి అందుకుని అక్కడినుండి ఉడాయిస్తాడు.ఇంకా తెలివిగల వాడైతే కాస్త కూర్చుని ఫ్రీజ్ లో వున్న ఆహార పదార్ధాలను కూడా తినేసి వెళ్లతాడు.ఇక ప్రమాద కరమైన దొంగ, దొంగతనం చేసే సమయంలో ఎవరైన అడ్డొస్తే విచక్షణ రహితంగా చంపేస్తాడు.ఇంకొంత మంది వుంటారు వారు దొంగతనానికి వచ్చి చిలిపి చిలిపి పనులు చేస్తూ ఆడవాళ్ల దూస్తులూ ఎత్తుకెళతారు.అవేమి లేకుండా చాల చిత్రంగా,చిలిపిగా ప్రవర్తించాడు ఇక్కడ ఒక దొంగ..అతను చేసిన ఆకోతి పనేందో మనంతెలుసుకుందాం..



నూనుగూ మీసాలున్న ఓ కుర్రదొంగ అర్ధరాత్రి ఓ యువతి ఇంట్లోకి చొరబడి వస్తువులన్నీదొరికిన కాడికి సర్దేశాడు.ఆ తర్వాత అలసిపోయాడేమో అందుకే బాగా నిద్ర వచ్చిందనుకుంటా,తన ఒంటిమీదున్న దుస్తులన్నీ విప్పేసి,ఆమె దుప్పట్లోకి దూరి నగ్నంగా తెల్లవార్లు నిద్రపోయాడు.పొద్దున ఆ యువతి నిద్రలేచి చూసేసరికి పక్కలో దొంగ ఉన్నాడు.అది కూడా నగ్నంగా నిద్రపోతున్నాడు.ఇంకేముంది అతడిని చూసి షాకైంది.వెంటనే తేరుకుని ఫోన్ అందుకుని పోలీసులను పిలిచింది.ఆమె చేసే అలికిడికి సృహలోకి వచ్చిన దొంగ అక్కడి నుండి ఉడాయించాడు అందుకే వాన్ని వీడో వింత దొంగ అంటున్నారు..ఈ విచిత్ర ఘటన అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.



చికో స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న 21 ఏళ్ల యువతి,తన ఇంట్లోకి దొంగ చొరబడ్డాడని,అతడు తన పక్కనే నగ్నంగా నిద్రపోయాడని,పోలీసులకు ఫోన్ చేసింది.దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరారు.అయితే,అప్పటికే ఆ దొంగ పారిపోయాడు.ఇక పోలీసులు ఆమె చెప్పిన పోలికల ఆధారంగా అతడి కోసం వెతకడం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ సమాచారాన్ని మిగతా పోలీస్ స్టేషన్లకు కూడా అందించారు.అతడు ఎంతో దూరం పారిపోయి ఉండడని ఆమె చెప్పడంతో పోలీసులు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టి,మొత్తానికి ఆ దొంగను పట్టుకున్నారు.ఈ వింతపని చేసిన అతడి పేరు జక్వానే బాల్డ్విన్ బ్యాడ్జర్ అని,వయస్సు 19 ఏళ్లని పోలీసులు తెలిపారు.అతన్ని అదుపులోకి తీసుకొనే సమయంలో ఏడ్చేశాడని,ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడింది తానేనని,దుస్తులు విప్పేసి ఆమె పక్కన కేవలం నిద్రపోయానని,ఒప్పుకున్నాడన్నారు.అయితే,ఆమె ప్రక్కన నగ్నంగా ఎందుకు పడుకున్నాడనే విషయాన్ని మాత్రం చెప్పడంలేదన్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: