చంద్రబాబుకు కొన్ని రోజుల నుంచి టీడీపీ పైడ్ ఆర్టిస్టులతో నానా హంగామా చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇలానే .. టీడీపీ కార్యకర్తల మీద దాడులు పెరిగిపోతున్నాయని పబ్లిసిటీ రాజకీయాలు చేశారు. కానీ అప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే మళ్ళీ షురూ చేశారు. కామెడీ ఏంటంటే ఇప్పుడు కూడా జనాలు పెద్దగా సీరియస్ గా తీసుకోవటం లేదు. కానీ బాబు మాత్రం ;పొలిటిల్ మైలేజ్ కోసం తెగ పాకులాడుతున్నారు. చంద్రబాబు నాకు 40 ఏళ్ల అనుభవం ఉందని ఎప్పటి నుంచో డప్పు కొట్టుకున్నాడు. మొన్న ఎన్నికలో మాకు మీ అనుభవం వద్దని సైకిల్ చక్రాలు విరగొట్టారు.


యువ నాయకుడైన జగన్ ను ఎన్నుకున్నారు. చంద్రబాబు తీసుకోలేని ఎన్నో నిర్ణయాలను జగన్ కేవలం మూడే మూడు నెలలో తీసుకుని ఔరా అనిపించారు. ఈ విషయంలో చంద్రబాబు సిగ్గు పడాల్సింది పోయి ఇంకా విమర్శలు చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వం అయిన టీడీపీ .. ఉద్యోగులను మభ్య పెట్టి చివరికి వారికీ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి. చంద్రబాబు వారిని పట్టించుకోకుండా ఐదేళ్లు గడిపేశారు. కానీ ఇప్పుడు జగన్ చేయడంతో చాలా అసహనానికి గురౌతున్నారు. 


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అదనపు ఆర్ధిక భారం పడుతుందని బాబు భావించి ఆ దిశగా ఎన్నడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి క్యాబినెట్ ముద్ర కూడా వేసింది. దీనితో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎక్కడ లేని ఆనందం వ్యక్తం అవుతుంది. ఇదొక్క నిర్ణయం చాలు .. ప్రజల సమస్యల పట్ల జగన్ ఎంత చిత్త శుద్దితో పనిచేస్తున్నారని ! తన తండ్రి రాజన్న పాలనను గుర్తుకు తెస్తున్నారని .. రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో పరిపాలనను నడిపిస్తున్నారని . ఎవరు ఏది అడిగిన బోళా శంకరుడు మాదిరిగా హామీలు నెరవేర్చడం ఇవన్నీ జగన్ ప్రతిష్టను పది రెట్లు చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: