మనదేశం గురించి మనకు తెలిసిన విషయాలు ఎన్ని ఉన్నాయి.  ఏవైనా కొన్ని విషయాలు గురించి చెప్పమంటే మొదట చెప్పే మాట దేశానికీ స్వతంత్రం ఎప్పుడు వచ్చింది.. దేశపిత అని ఎవరిని అంటారు.. దేశం మొదటగా ప్రయోగించిన ఉపగ్రహం పేరేంటి.  ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది.  ఇలాంటి విషయాలన్ని చెప్తుంటారు.  ఇది అందరికి తెలిసిన విషయమే.  


అయితే దేశంలో సూర్యకిరణాలు ఎక్కడ ప్రసరిస్తాయి అంటే తక్కువ వచ్చే సమాధానం అరుణాచల్ ప్రదేశ్.  అరుణాచల్ ప్రదేశ్ లో ఎక్కడ అంటే చాలామంది తెల్లమొహం వేస్తారు. అరుణచల్ ప్రదేశ్ అని తెలుసు.. కానీ, అది ఎక్కడో తెలియదు.. ఆ ప్లేస్ అని ఆలోచిస్తుంటారు. ఆలోచనలు ఉంటాయి కానీ, ఎక్కడో కరెక్ట్ గా గుర్తుకు రాదు.  ఆ ప్లేస్ పేరు డాంగ్.  అరుణాచల్ ప్రదేశ్ లో చివరి గ్రామం.  ఆ తరువాత చైనా బోర్డర్.  ఈ గ్రామంలోనే మొదటి సూర్యకిరణాలు ప్రవేశిస్తాయి.  


ఎత్తైన కొండల మధ్య.. అందమైన ప్రదేశంలో ఈ గ్రామం ఉన్నది.  చల్లగా ఉండే ఆ గ్రామంలో చాలా స్పెషల్ ఉంటుంది.  అక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది.  అందమైన ప్రకృతి రమణీయత కనిపిస్తుంది.  ఎప్పుడు చూడని వింతలు అక్కడ మనకు కనిపిస్తుంటాయి.  అందుకే ఆ ప్రదేశం ఫేమస్ అయ్యింది. అయితే, ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తమలో కలుపుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. 


ఇండియా మాత్రం అందుకు అంగీకరించడం లేదు.  అరుణచల్ ప్రదేశ్ లో సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది.  ఇక ఆ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులు ఏంటి అంటే.. పర్యాటకం.  పర్యాటకంగా ఆ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది.  సిమ్లా వంటి ఎన్నో ప్రాంతాలు అక్కడ కనువిందు చేస్తుంటాయి.  శీతాకాలం వచ్చింది అంటే అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకులతో కళకళలాడుతుంది.  అరుణాచల్ ప్రదేశ్ లో బౌద్ధమతం ఎక్కువుగా కనిపిస్తుంది.  ఆ రాష్ట్ర అధికారిక భాష ఇంగ్లీష్.  ఈటనగర్ రాజధాని.  ఈ రాష్ట్ర జనాభా కేవలం 12.6 లక్షలు మాత్రమే.  


మరింత సమాచారం తెలుసుకోండి: