తెలుగుదేశంపార్టీ మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అంటే ఈ అరెస్టుకు చలో ఆత్మకూరు కార్యక్రమానికి సంబంధం లేదు లేండి. చింతమనేని పై దాదాపు 15 రోజుల క్రితం ఎస్సీ వేధింపుల చట్టం క్రింద ఓ కేసు పెట్టారు పోలీసులు. విచారణకు రమ్మని చెబితే అరెస్టు భయంతో తప్పించుకు తిరుగుతున్నారు అప్పటి నుండి.

 

గడచిన 15 రోజులుగా పోలీసుల నుండి తప్పించుకుని ఎక్కడెక్కడో తిరిగారు. చివరకు ఏమనుకున్నారో ఏమో ? ఎక్కువ రోజులు పోలీసులను నుండి తప్పించుకుని తిరగటం సాధ్యం కాదని అనుకున్నట్లున్నారు. ఎందుకంటే నియోజకవర్గాన్ని అయిన వాళ్ళను వదిలేసి ఎన్ని రోజులని చింతమనేని మాత్రం తిరుగుతారు. అందుకనే చివరకు ఈ రోజు పోలీసుల ముందు ప్రత్యక్షమవ్వాలని అనుకున్నారు.

 

ఎప్పుడైతే చింతమనేని తన ఇంట్లో ఉన్నారని తెలిసిందో వెంటనే పోలీసులు వెళ్ళి మాజీ ఎంఎల్ఏని అరెస్టు చేశారు. దాంతో పరారీలో ఉన్న టిడిపి మాజీ ఎంఎల్ఏల్లో ఒకళ్ళని పోలీసులు అరెస్టు చేసినట్లైంది. విచిత్రమేమిటంటే చింతమనేనిపై ఫిర్యాదు చేస్తే కనీసం కేసు నమోదు చేసుకోవటానికి కూడా ఓ మహిళా ఎసై ఇష్టపడలేదు.  ఆ విషయం వెలుగు చూడగానే ఉన్నతాధికారులు సదరు మహిళా ఎసైని వెంటనే విధుల నుండి తప్పించారు కూడా.

 

ఇక అధికారంలో ఉండగా చింతమనేని చేసిన అరాచకాలకు, దాష్టికాలకు అంతే లేదు. ఎవరిని పడితే వాళ్ళని కొట్టేవారు. అప్పట్లో ప్రతిపక్షం వైసిపి నేతలని లేదు చివరకు అధికారులని కూడా చూడలేదు. బహిరంగ సభల్లో కూడా నోటికొచ్చినట్లు అధికారలను బండబూతులు తిట్టిన సందర్భాలున్నాయి.

 

తనపై ఎన్ని కేసులు నమోదైనా చింతమనేని లెక్క చేయలేదు. ఎప్పటికి టిడిపినే అధికారంలో ఉంటుందని, తానే ఎంఎల్ఏగా ఉంటానని అనుకున్నట్లున్నారు. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో పార్టీతో పాటు తాను కూడా ఓడిపోవటంతో చింతమనేని బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు రావటం మొదలుపెట్టారు. అంతా కలిసి ఇపుడు పోలీసులకు ఫిర్యాదులు ఇస్తుంటే చింతమనేనికి కష్టాలు మొదలయ్యాయి. విచిత్రమేమిటంటే 49 కేసులున్న చింతమనేని లాంటి వాళ్ళని చంద్రబాబు పెంచి పోషించారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: