కశ్మీర్ పై పాకిస్థాన్ ఎప్పుడూ దుష్ప్రచారమే చేస్తుంది. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అసత్యాలను ప్రచారం చేస్తోంది. అంతర్జాతీయ వేదికపై భారత్ ను దోషిగా నిలబెట్టేందుకు విఫలయత్నాలు చేస్తూనే ఉంది పాక్. అంతేకాదు కశ్మీర్ తమదని కశ్మీర్ స్వాతంత్య్రం కోసం సహకరిస్తామని పదేపదే రెచ్చగొడుతూ ఉంటుంది. అయితే కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని అందరికీ తెలుసు, ఈ విషయం పాకిస్థాన్ కు కూడా తెలుసు పైకి మాత్రం కశ్మీర్ తమదేనంటూ బుకాయిస్తోంది. కానీ ఎట్టకేలకు పాకిస్థాన్ నిజం ఒప్పుకుంది.



కశ్మీర్ భారత్ దేనని అనుకోకుండా స్పష్టం చేస్తోంది. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశాల్లో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ప్రసంగించారు. ఎప్పటిలానే భారత్ పై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం ఏక పక్షంగా రద్దు చేసింది, ఇది అంతర్జాతీయ నియమకాలకు విరుద్ధమని ఆరోపించారు. ఆర్టికల్ రద్దుతో కశ్మీరీల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని ఆంక్షలతో కశ్మీర్ తో బాహ్య ప్రపంచానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అని తప్పుడు వ్యాఖ్యలు చేశారు.



కశ్మీర్ లోయలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ భారత్ పై బురదజల్లే ప్రయత్నం చేశారు ఖురేషి. అయితే తన ప్రసంగంలో ఇండియన్ స్టేట్ ఆఫ్ కశ్మీర్ అనగా భారత రాష్ట్రమైన కశ్మీర్ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ పై అబద్ధపు ఆరోపణలు చేస్తూనే కశ్మీర్ భారత రాష్ట్రమని ఉచ్చరించారు ఖురేషి. తర్వాత అసలు విషయం తెలిసి నాలుక కరుచుకున్నారు ఆయన వ్యాఖ్యలతో భారత్ వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకోవాలని చూస్తుందన్న విషయం అంతర్జాతీయంగా స్పష్టమైంది. కాగా యూ ఎన్ హెచ్ ఆర్సీలో ఏసియా పసిఫిక్ గ్రూప్ లో భాగంగా ఇండియా పాకిస్థాన్ మధ్య దేశాలుగా ఉన్నాయి. రెండు వేల ఇరవై ఒకటిలో భారత సభ్యత్వ గడువు ముగియనుండగా పాకిస్థాన్ గడువు రెండు వేల ఇరవైలో ముగియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: