ఈ తరంలో  రాజకీయాల్లో స్పీడ్ గా  సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ... ఎవరు ఎన్ని విమర్శలు చేసినా  వాటిని అవలీలగా ప్రకటించేయడం.. అమలు పరచడం..  ఈ తరంలో ఒక్క జగన్ కే  చెల్లిందని చెప్పుకోవాలి.  ప్రస్తుతం వరుస సమీక్షలతో ఇచ్చిన హామీల అమలు కోసం పక్కా ప్లాన్ తో ముందుకు పోతున్నాడు జగన్.   ఇసుక మాఫియాకు అవకాశ‌మే ఇవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో జ‌గ‌న్  ఇసుక పై కొత్త విధివిధానాలను ప్రవేశ పెట్టారట.  ఈ విధానం పై జ‌రిగిన స‌మీక్ష‌లో సీఎం మాట్లాడుతూ అవినీతిని అడ్డుకోవ‌డం వ‌ల్ల అది స‌హించ‌లేనివారే ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. ఇక అక్టోబరు 2 న గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభానికి  సన్నాహాల పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ఏమైనా  నాలుగు నెలల వ్యవధిలో 4 లక్షలకు పైగా నియామకాలు చేయగలగడం గతంలో ఎప్పుడూ జరగలేదు.  గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని అధికారాన్ని దక్కించుకున్నప్పటి నుండీ.. జగన్ తన నిర్ణయాలతో  ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నారు.  ఇచ్చిన హామీల  పై విమర్శలు వచ్చినా.. జగన్ మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదు.  ముఖ్యంగా  గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు గత కొన్ని రోజులుగా విపరీతంగా కసరత్తులు చేయిస్తున్నాడు. ముఖ్యంగా  పోలవరం, రాజధాని, ఇసుక వంటి వాటిలో వైసీపీ ప్రభుత్వం ఆచీతూచి అడుగులు వేస్తూ టీడీపీ అవినీతిని భయటపెట్టే పనిలో ఉంది. 


అలాగే ఇప్పటికే  గతంలో టీడీపీ హయాంలో జరిగిన భూముల వేలం పై విజిలెన్స్ విచారణ జరిపించాలని జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి జగన్ ప్రభుత్వం  ఇవ్వన్నీ చేస్తోంది..  చంద్రబాబు ప్రభుత్వం  అనేక రకాలుగా  అవినీతికి పాల్పడిందని నిరూపించి..   బాబును అవినీతి కేసులో ఇరికించడానికే అని సర్వత్రా చర్చ జరుగుతోంది..  ఈ పరిణామాల పై  బాబు షాక్ అవుతున్నాడట. టెన్షన్ కూడా పెరిగిపోతుందట.  ఏది ఏమైనా జగన్ బాబుగోరికి నిద్ర కూడా లేకుండా చేస్తున్నాడు.   జగన్ ముఖ్యమంత్రిగా  కీలక నిర్ణయాలతో  తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు. మరోపక్క బాబు 'ఛలో ఆత్మకూరు' అంటూ హడావుడి చెయ్యడానికి ప్రయత్నాలు చేసినా.. జగన్ వ్యూహాత్మకంగా బాబును మరియు తెలుగు తమ్ముళ్లను ఎట్టకేలకూ అడ్డుకోగలిగారు.     


మరింత సమాచారం తెలుసుకోండి: