ఆటో మొబైల్ రంగం రోజురోజుకు సంక్షోభంలోకి జారుకోవడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త వాదన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆటో మొబైల్ ఇండస్ట్రీ మందగమనానికి నేటి యువతే కారణమన్నారు. ఇప్పుడంతా ఓలా, ఉబర్ లాంటి క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారని సొంతకారుల వైపు మొగ్గు చూపడం లేదన్నారు. ఈఎంఐ భారం మోసేందుకు ఇష్టపడటం లేదని తెలిపారు మిలీనియస్ క్యాబ్ లపై ఆసక్తి చూపడంతో ఆటో మొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోంది అన్నారు దీంతో సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి.


ఆర్ధిక మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. యువతకు పానీపూరీ అంటే ఇష్టం అందుకే బిహెచ్ఇఎల్ పదిహేను నెలల కనిష్టానికి పడిపోయినట్టు బైకాట్ మిలీనియల్స్ ట్రెండ్స్ హల్ చల్ చేస్తున్నాయి, పనిలో పనిగా కొత్త మోటార్ వెహికిల్ యాక్ట్ పైన సెటైర్లు పేలుతున్నాయి. డ్రైవింగ్ టెన్షన్స్, నిబంధనల ఉల్లంఘనలు, చలాన్లు, పార్కింగ్ ఇబ్బందులు ఉండవని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బేసిక్స్ ప్రమాణాలు రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతో పాటు యువత ఎక్కువగా క్యాబ్ మెట్రో రైలుపై ఆధారపడుతుండడం కూడా ఆటో మొబైల్ రంగంలో మందగమనానికి కారణమని వ్యాఖ్యానించారు.


ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీల విక్రయాలు ఇటీవల రికార్డు స్థాయిలో క్షీణించిన నేపధ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటో మొబైల్ రంగాల్లో ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో క్యాబ్ డ్రైవర్ లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కస్టమర్లు లేక కష్టాలు పడుతుంటే కేంద్రమంత్రి ఇలా అనడం బాధాకరమన్నారు. మందగమనాన్ని చూపించి క్యాబ్ సంస్థలు కూడా సరైన లాభాలు ఇవ్వడం లేదంటున్నారు. మరోవైపు మారుతీ సుజుకీ, అశోక్ లేలాండ్ వంటి మానిఫ్యాక్చరింగ్ సంస్థలూ తమ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో తమ ప్లాంట్లకు సెలవులు ఇచ్చేస్తున్నాయి. అశోక్ లేలాండ్ ఐదు ప్లాంటుల్లో పదహారు రోజుల పాటు తాత్కాలిక సెలవులిచ్చి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.





మరింత సమాచారం తెలుసుకోండి: