ఎవరూ పెద్దగా గమనించలేదు కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి దాక్కుంటున్నారు. పార్టీలోనే పెద్ద నోరున్న వారిగా పేరున్న ప్రముఖ రాజకీయ వేత్తలైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్ మరియు యరపతినేని శ్రీనివాసరావు గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. చింతమనేని అంటే ఈ రోజు బయటికి వచ్చి అరెస్ట్ అయ్యాడు అనుకోండి.... మిగతా వారి ఆచూకీ మాత్రం గత పది రోజులుగా ఎవ్వరికీ తెలీదు. అసలు వీరు దాక్కోవడానికి కారణం వీరిపై ఉన్న కేసులు మరియు బయటికి వస్తే వీరిని అరెస్ట్ చేస్తారన్న భయం.

రోజు రోజుకీ వీరిపై ఉన్న కేసుల సంఖ్య పెరిగిపోగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. కేవలం చింతమనేని ప్రభాకర్ ఒక్కరి మీద దాదాపు యాభై రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సోమిరెడ్డి మీద భూ ఆక్రమణ కేసులు మరియు సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులు ఉన్నాయి. వీటికి సంబంధించి అతనికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. వీరితో పాటు అండర్ గ్రౌండ్ లో ఉన్న మరొకరు ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. అతనిపై గవర్నమెంట్ ఆఫీస్ పైన దాడి చేసిన కేసులో ఉండగా మరోవైపు గురజల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసిన కేసు మీద బెయిలు కోసం ప్రయత్నిస్తున్నాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ నలుగురు నేతలు తాము అధికారంలో ఉన్నప్పుడు వైయస్ఆర్సిపి పార్టీని వీలు చిక్కినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేల పైన కేసులు ఉన్నాయి కానీ వారిలో ఎవరు వీరు లాగా కనిపించకుండా పోలేదు. కానీ వీరు మాత్రం భయపడి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. అప్పట్లో వైసీపీ నేతలు తమకు అధికారం లేకపోయినా ధైర్యంగా అన్నిటిని ఎదుర్కొన్నారు కానీ టిడిపి నేతల లాగా వ్యవహరించలేదు. ఇంతకుమించి వివరించి చెప్పాల్సినది ఏముంది.... చెప్పండి.


మరింత సమాచారం తెలుసుకోండి: