సాధారణంగా మందు తాగితే అబ్బో నీకు మందు అలవాటు ఉందా అంటూ వెటకారంగా మాట్లాడుతుంటారు.  విచిత్రం ఏంటేంటే ఏ రాష్ట్రంలో మద్యంపైనే ఎక్కువ రాబడి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.  కొన్ని రాష్ట్రాల్లో మద్యం పూర్తిగా నిషేదిస్తున్నామంటారు..ఏదో వంకతో తిరిగి ప్రారంభిస్తారు.  ఎందుకంటే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయ వనరు ఏందటే మద్యమే అని చెప్పొచ్చు.  సామాన్యుల నుంచి సంపన్నుల వరకు మద్యం అలావాటు ఉన్నవారు చాలా మంది ఉంటారు. 

సాధారణంగా మద్యం షాపు కి వెళ్తే జేబులో ఉన్న డబ్బుకు చిల్లు పడాల్సిందే.  కానీ ఇప్పుడు ఏపిలో మద్యం కొనడానికి క్యూలు కడుతున్నారు..అదేంటీ మద్యం కోసం అంత ఇబ్బందులు పడుతున్నారా అవును పడతారు ఎందుకో తెలుసా ఇప్పుడు అక్కడ మద్యంతో పాటు మంచి మంచి గిఫ్టులు, ఆఫర్లు, డిస్కౌంట్స్ ఇస్తున్నారు.  వివరాల్లోకి వెళితే..ఏపీలో మద్యం ప్రియులకు  బెల్ట్ షాప్ యజమానులు భలే ఆఫర్లు ప్రకటించారు. దీంతో గతంతో లేని రీతిలో మద్యం అమ్మలు జోరందుకున్నాయి.

దుకాణాదారులు మద్యం అమ్మకాలపై భారీ డిస్కాంట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు ఇస్తూ.. మందుబాబులను ఆకర్షిస్తున్నారు. దాదాపు రూ.2 వేలు విలువ చేసే  ఖరీదైన మందు బాటిల్‌కు రూ.300లకు పైగా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక ఒకేసారి మూడు లేదా నాలుగు బాటిళ్లు కొంటే.. టూరిస్ట్ బ్యాగులు, లెదర్ బ్యాగులు, కొన్ని కొన్ని షాపుల్లో అయితే ఫర్నీచర్‌ను కూడా ఇస్తున్నారు. దీని వెనుక అసలు కారణం ఏంటంటే..అక్టోబర్ 1వ తేదీ నుంచే విక్రయాలను నిర్వహించనుండటంతో మద్యం దుకాణాదారులు ఉన్న సరుకును క్లియర్ చేసుకోవడానికి ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

రెండేళ్లకోసారి షాపు లైసెన్స్ గడువు ముగిసే సమయంలో మిగిలిపోయిన మద్యాన్ని ఎక్సైజ్ శాఖ తీసుకుంటుంది.  భవిష్యత్ లో లైసెన్స్ వస్తుందో రాదో తెలియదు.. ఈ సారి మద్యం వ్యాపారం పూర్తిగా ప్రైవేటు పరం కానున్నందున.. వ్యాపారస్తులు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. ఉన్న సరుకుని ఎలాగైనా వదిలించుకోవాలని ఆఫర్లు ఇచ్చి ఇలా అమ్మేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: