ఎవరిని పడితే వారిని ఎంతపడితే అంత మాట్లాడితే ఫలితం ఇలాగే ఉంటుంది. మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పై  కేసు నమోదైంది. అందరి ముందు చలో ఆత్మకూరు ఘటన సందర్భంగా ఓ మహిళా దళిత ఎస్సై అనూరాధపై నోరు చేసుకున్న ఫలితంగా నన్నపనేనిపై కేసు నమోదైంది.

 

చలో ఆత్మకూరు అంటూ చంద్రబాబునాయుడు పిలపందుకుని రోడ్లపైకి వచ్చిన నేతల్లో నన్నపనేని రాజకుమారి కూడా ఉన్నారు. ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు వ్యాన్ ఎక్కించారు.  ఆ సమయంలో ఓ దళిత మహిళా ఎస్సైని ఉద్దేశించి ’ఈ దళితులతోనే దరిద్రమంతా వచ్చింది’ అంటూ దూషించారు.

 

విధి నిర్వహణలో ఉన్న ఓ దళిత ఎస్సైని రాజకుమారి దూషించటం ఆడియో, వీడియోల్లో స్పష్టంగా ఉంది. దాంతో మనస్ధాపానికి గురైన అనూరాధ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే క్రమంలో గురువారం రాజకుమారిపై ఫిర్యాదు చేయటంతో పోలీసులు రాజకుమారిపై వివిధ సెక్షన్ల క్రింద  కేసు నమోదు చేశారు. రాజకుమారి నోరు పారేసుకున్నపుడే అందరికీ అర్ధమైపోయింది  కేసు తప్పదని.

 

మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ గా పనిచేసిన సీనియర్ నేతకు ఎవరితో ఎలా మాట్లాడాలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నోటికొచ్చినట్లు మాట్లాడారంటే అహంకారం తప్ప మరోటి కనబడటం లేదు.  ఇప్పటికే నోటికొచ్చినట్లు మాట్లాడిన టిడిపి మాజీ ఎంఎల్ఏలపై ఎస్సీ వేధింపుల కేసులు నమోదైన విషయం తెలిసి కూడా రాజకుమారి తన ధోరణిలోనే అవమానించేట్లు మాట్లాడారంటే ఏమనర్ధం ?

 

అంటే ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూపి రచ్చ చేయటమే టిడిపి నేతల ఉద్దేశ్యంగా కనబడుతోంది. ఒకవైపు రాజకుమారి మరోవైపు అచ్చెన్నాయుడు, భూమా అఖిలప్రియలు కూడా పోలీసులపై నోరుపారేసుకున్న విషయం అందరకీ తెలిసిందే. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా  నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటే ఇక అధికారంలో ఉన్నపుడు ఎంతలా చెలరేగిపోయుంటారో అర్ధమైపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: