ముఖ్యమంత్రిగా  'వై ఎస్ జగన్'  సంచలనాత్మక నిర్ణయాలతో  ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతున్నారు.  పరిపాలన, ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్సార్ నిర్ణయాలు దేశానికే ఎలా మార్గదర్శకాలయ్యాయో..  జగన్  పథకాలు కూడా అలాగే అవ్వాలననేదే  జగన్ ప్లాన్.  అందుకే కొన్ని పథకాల విషయంలో జగన్ చాల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం అయ్యాడు కదా..   కొత్తలో అలాగే ఉంటుందిలే అనుకున్న వారంతా.. ఇప్పుడు జగన్ ప్లాన్ లు.. ఆర్ధికపరమైన లావాదేవీల  గురించి జగన్ కున్న అవగాహన చూసి ఆశ్చర్యపోతున్నారట.  ఇప్పటికే తను ఇచ్చిన  హామీల అమలు పై  క్లారిటీగా ఉన్నా జగన్.. వరుస సమీక్షలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు.  తాజాగా ఇరిగేషన్‌ పై జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పై ప్రాజెక్టుల వారీగా,  జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ జరిగిన పనులు, పెండింగ్‌ లో ఉన్న పనుల పై అధికారుల నుంచి  పూర్తిగా అడిగి తెలుసుకున్నారు.  పనులు వేగంగా అవ్వాలని అధికారులకు సూచించారు. అలాగే  ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి విడుదల చేశారు.  అయితే  జగన్ ప్రభంజనంలో తమ ఉనికిని కాపాడుకోవటానికి బాబు నానా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. వైయస్‌ఆర్‌ సీపీ హింసా రాజకీయాలకు  పాల్పడుతుందని  చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. 


అయితే మరో పక్క  పెయిడ్‌ ఆర్టిస్టులు, టీడీపీ దొంగలతో డ్రామాలు ఆడించి రాష్ట్రంలో లేని శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని బాబు కుట్రలు చేస్తున్నారని.. మొత్తంగా పల్నాడులో టీడీపీ ఖాళీ అయిపోతుందని వైసీపీ వాళ్ళు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు.  అయితే జగన్ మాత్రం  తను ఎన్నికల  సమయంలో ఇచ్చిన నవ రత్నాల హామీల పైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.  అందుకే సీఎం అయినా మొదటి రోజు నుండి నవ రత్నాల మీద ఫోకస్ పెట్టాడు జగన్. అందులో భాగంగా మొదట గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అలా తమ పధకాలు నేరుగా ప్రజల్లోకి  వెళ్లేలా చేయటానికి సరికొత్త ప్లాన్ సిద్ధం చేశాడు. ఇప్పటికే  నవరత్నాల హామీను ఆచరణలో పెట్టబోతున్న  జగన్.. ఇంకా అదనపు హామీల కోసం కూడా  అహర్నిశలు శ్రమిస్తున్నాడు.  సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా  జగన్  టీడీపీని మరియు బాబును ముప్పుతిప్పలు పెడుతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: