సంకీర్ణ ప్ర‌భుత్వాలు, పొత్తులు సాగుతున్న కాలం ఇది. ఎప్పుడు పొత్తులు విచ్చుకుంటాయో తెలియ‌దు.. ఎప్పుడు పొత్తుల పొద్దు పొడుస్తుందో అర్థం కాదు. ఎప్పుడు పొత్తుల పొద్దు అస్త‌మిస్తుందో అంతుచిక్క‌దు... ఈరోజు మిత్ర‌ప‌క్షం అంటారు.. తెల్లారితే శ‌త్రుప‌క్షం అయిపోతారు. అంతా అధికారం మహిమ‌.. భార‌త‌దేశంలో కేంద్రంలోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ర‌క‌మైన ప‌రిస్థితి. ఇట్లా పొత్తులు పొడిసి, మ‌ళ్ళీ పొత్తులు విడిపోయి శ‌త్రువులుగా మారి, మ‌ళ్ళీ అదే శత్రువుల మ‌ద్య పొత్తులు పొడ‌వ‌టం స‌ర్వ‌సాధార‌ణంగా మారిన నేప‌ధ్యం ఇది. అట్లా మ‌నం నిత్యం ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్‌లో, ఇప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో చూశాము.. చూస్తున్నాం.


అయితే ఏపీలో అయితే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ బీజేపీతో పొత్తుపెట్టుకుని అధికారం చెలాయించింది. త‌రువాత శ‌త్రువులుగా మారారు. త‌రువాత కొంత కాలానికి మ‌ళ్ళీ మిత్రుల‌య్యారు.. పొత్తుతో పోటీ చేసి వైసీపీని ఓడించి సంకీర్ణ స‌ర్కారు న‌డిపారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని మ‌ళ్ళీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఘోరంగా ఓడిపోయాడు.. ఇలా మ‌నం నిత్యం పొత్తుల ఎత్తులు వేస్తూ కొంద‌రు చిత్త‌యితే.. కొంద‌రు విజ‌యం సాధిస్తున్నారు.


అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే అధికారం చెలాయించినంత కాలం ఈ పొత్తులు బాగానే ఉంటున్నాయి.. సంసారం సాఫీగా సాగిస్తూనే ఉన్నారు.. కానీ పొత్తుతో అధికారం రాద‌ని తెలిస్తే వెంట‌నే పొత్తును విర‌మించుకుంటూ మ‌రో పార్టీతో పొత్తు అనే సంసారం చేస్తున్నారు. ఇటీవ‌ల కాంగ్రెస్ మ‌రో పార్టీ వేర్వేరుగా ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. కానీ అనుకోకుండా  కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చింది.. ఏడాది పాటు క‌లిసి స‌ర్కారు అనే సంసారం సాగించారు.. సంసారంలో క‌ల‌త‌లు రావ‌డం స‌హాజం కానీ, ఈ సంసారం సాఫీగా సాగ‌డం లేద‌ని ప‌క్క పార్టీ వాడు  గ్ర‌హించాడు.. ఇదే అద‌నుగా సంకీర్ణంలో చిచ్చు రేపాడు.. అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా ప‌థ‌కం వేసి విజ‌యం సాధించాడు.


పొత్తులోనూ క‌య్యాలు ఉండ‌టం ప‌క్క‌పార్టీ వాడికి క‌లిసొచ్చి అధికారం హ‌స్త‌గ‌తం చేసుకున్నాడు.. సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. ఇప్పుడు అక్క‌డ ఉప ఎన్నిక‌లు రాబోతున్నాయి.. వీటిని హ‌స్త‌గ‌తం చేసుకోవాలంటే త‌ప్ప‌కుండా పొత్తు పెట్టుకోవాల్సిందే.. కాంగ్రెస్ క‌లిసి పోటీ చేద్దామంటుంది.. ఆ పార్టీ మాత్రం ఏమీ చెప్ప‌డం లేదు.. ఈ రెండు పార్టీ పొత్తు ఎప్పుడు కుదురుతుందో.. ఎప్పుడు తెగిపోతుందో ఎవ‌రికి అంతు చిక్క‌డం లేదు.. అయితే మ‌రీ ఈ ఉప ఎన్నిక‌ల్లో పొత్తు కుదిరేనా అనే సందేహాలు వ‌స్తున్నాయి.


మ‌రీ ఆ నేత కాంగ్రెస్‌తో చేసిన ఏడాది కాపురంకు మళ్ళీ కొన‌సాగిస్తాడో.. లేక నీదో దారి నాదో దారి అంటాడో వేచి చూడాలి మ‌రి.. ఓ మీకు ఇంత‌కు ఈ పొత్తుల సంపారంలో ఏడాది కాలం గ‌డిపి ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకు అత‌డు సిద్ద‌మ‌య్యేనా అనేది ఎవ‌రో చెప్ప‌లేదు క‌దూ.. ఇంకెవ‌రూ మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవేగౌడ‌. ఆయ‌న పార్టీ జేడీఎస్‌. క‌ర్నాట‌క‌లో రాబోవు ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో జేడీఎస్ క‌లిసి ముందుకు సాగుతుందో లేదో అనేది కొద్ది రోజుల్లో తేల‌నున్న‌ది.



మరింత సమాచారం తెలుసుకోండి: