టెక్సాస్ లోని హ్యూస్టన్ లో ఎన్ఆర్జీ స్టేడియంలో ప్రవాస భారతీయులు హౌడీమోడీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి 20దేశాల నుంచి 48 యూఎస్ రాష్ట్రాల నుంచి దాదాపు 50వేలమంది ప్రజలు హాజరయ్యారు.  ఈ వేడుక కోసం రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టారు.  అయితే వేడుకకు మరో వారం రోజులు ఉందనగా .. హౌడీ మోడీ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  


మోడీతో పాటు ట్రంప్ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతుండంతో.. సెక్యూరిటీని పెంచారు.  ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడేందుకు ట్రంప్ వస్తుండటంతో ట్రంప్ తో పాటుగా వివిధ నగరాలకు చెందిన సెనేటర్లు, గవర్నర్లు కూడా హాజరయ్యారు.  ఈ వేడుకలో సెనేటర్లు, గవర్నర్లు మోడీని ఆకాశానికి ఎత్తారు.  అటు ట్రంప్ సైతం మోడీ ప్రభుత్వాన్ని అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.  అంతా బాగుంది.. అయితే, ఈ కార్యక్రమం జరగాల్సిన సమయం కంటే ఆలస్యంగా జరగడం కొంత విచారం అని చెప్పాలి.  


అనుకున్నట్టుగా భారత కాలమానం ప్రకారం మోడీ రాత్రి 9:20 గంటలకు హౌడీమోడీ వేదికకు చేరుకున్నారు.  కానీ, ట్రంప్ మాత్రం గంట ఆలస్యంగా వేదికకు చేరుకోవడంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.  ట్రంప్ ఎందుకు ఆలస్యంగా వచ్చారు.. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఆలస్యంగా రావడం ఏంటి అనే ప్రశ్నలు ఒకదాని తరువాత మరొకటిగా బయటకు వచ్చాయి.  అసలు ట్రంప్ ఎందుకు ఆలస్యంగా వచ్చారు.  కారణం ఏంటి తెలుసుకుందాం.  


ట్రంప్ వాషింగ్టన్ నుంచి అనుకున్న సమయానికి బయలుదేరారు.  అయితే హ్యూస్టన్ లోని ఎల్లింగ్టన్ ఎయిర్ బేస్ లో టెక్సాస్ లో కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలు, వరదలు.. వరదల నష్టం.. మరణించిన వ్యక్తుల వివరాలు వంటి విషయాలపై చర్చించే సరికి ఆలస్యం అయ్యిందట.  మాములుగా రాత్రి 9:39 ట్రంప్ ప్రసంగం మొదలు పెట్టాలి.  కానీ ఆలస్యం కావడంతో గంట ఆలస్యంగా ప్రసంగం మొదలైంది.  ట్రంప్ 25 నిమిషాలపాటు ప్రసంగించారు.  ఈ ప్రసంగంలో అమెరికా పాలనా విషయాలతో పాటు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కూడా ప్రస్తావించారు.  మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: