తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచ్చలూరు  వద్ద గత నెల 15న జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా విషాదం లో నెట్టిన విషయం తెలిసిందే. 77 మంది ప్రయాణికులతో పాపికొండల టూర్ కి బయలుదేరిన బోటు  గోదావరి ప్రవాహం ఉదృతి పెరగడంతో సుడిగుండం కారణంగా ప్రమాదానికి గురైంది. కాగా ఈ ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు దక్కించుకొని సురక్షితంగా బయటపడగా  ఇంకొంతమంది వరద ప్రవాహం లో కొట్టుకుపోయారు. అయితే గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన ప్రభుత్వం కొంతమంది మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. 

 

 

 

 

 అయితే మిగిలిన మృతదేహాలు మునిగిపోయిన బోటు లోనే ఉండవచ్చని ఊహించిన అధికారులు గోదావరి ప్రవాహం దృశ్య వాటిని వెలికితీయడం తమ వల్ల కాదని  చేతులెత్తేయడంతో బోటుని వెలిక్కి తీసే పనులను ప్రభుత్వం   తాజాగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. బోటును వెలికి తీసే పనిలో 35 ఏళ్ల అనుభవం ఉన్న ధర్మాడి  సత్యం బృందానికి ఈ పని అప్పజెప్పింది  ఏపీ ప్రభుత్వం. అయితే గత మూడు రోజుల నుండి ధర్మ డి సత్యం బృందం మునిగిపోయినా రాయల్ వశిష్ఠ బోటుని  వెలికితీత కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. 

 

 

 

 లంగర్ కు ఏదైనా వస్తువు తగిలితే దాని చుట్టూ రోప్  చుట్టి  పైకి లాగాలి అన్నది ధర్మాడి  సత్యం బృందం ప్లాన్. ఈ నేపథ్యంలోనే మొదటిరోజు ఈ ప్రయత్నంలో భాగంగా లంగరుకు  ఏదో బరువైన వస్తువు తగలడంతో అందరూ బోటు  అనుకున్నారు . అయితే దాన్ని బయటకు లాగే ప్రయత్నం లో ఐరన్ రోడ్డు కూడా తగ్గిపోవడంతో అది కచ్చితంగా బోటే  అయి ఉంటుందని ఫిక్స్ అయ్యారు అందరు. దాంతో రెండోరోజు బోటుని  తీయడం సాధ్యం  అవుతుందని భావించారు కానీ ధర్మాడి  సత్యం బృందం ప్రయత్నం మాత్రం ఫలించలేదు  రెండో రోజు మూడో రోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి ఉపయోగం లేకుండా పోయింది . అయితే నాలుగవ రోజు వర్షాల దృశ్య ప్రవాహం పెరగడంతో వెలికితీత పనులు నిలిచిపోయాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: