ఇప్పుడు తెలంగాణ‌లో ఏం జ‌రుగ‌బోతుందో అనే ఉత్కంఠ జ‌నాల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తెలంగాణ‌లో ఇప్పుడు ఆర్టీసీలో నెల‌కొన్న స‌మ్మెపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువ‌రించ‌నుంది. అయితే కోర్టు తీర్పు అటు స‌ర్కారుకు అనుకూలంగా ఉంటుందా.. లేక కార్మికుల ప‌క్షం వ‌స్తుందా ? అనేది ఉత్కంఠ క‌లిగిస్తోంది. తెలంగాణ‌లో గ‌త ఆరు రోజులుగా ఆర్టీసీ కార్మికులు త‌మ హ‌క్కుల కోసం స‌మ్మే చెస్తున్నారు. ద‌స‌రా పండుగ ను పుర‌స్క‌రించుకుని ఆర్టీసి కార్మికులు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చెందుకు ఈ స‌మ్మె చేస్తున్నారు. అయితే ఈ స‌మ్మెతో తెలంగాణ స‌ర్కారు ఉలిక్కి ప‌డింది. తెలంగాణ స‌ర్కారు కు ఆర్టీసీ కార్మిక సంఘాల నేత‌లు ముందుగానే హెచ్చ‌రించారు.


త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ముందుగానే ప్ర‌భుత్వానికి నోటీసులు ఇచ్చారు. కానీ తెలంగాణ స‌ర్కారు ఆల‌స్యంగా మేల్కోంది. కేవ‌లం ఉన్న‌త స్థాయి క‌మిటీని ఏర్పాటు చేసి చ‌ర్చ‌లు తూతూ మంత్రంగా జ‌రిపి డిమాండ్ల‌ను నెర‌వేర్చేది లేద‌ని ప్ర‌భుత్వం క‌ఠిన వైఖ‌రి తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ సంఘాలు తెలంగాణ స‌ర్కారు తీరుకు మండిప‌డి స‌మ్మెను చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించాయి. కానీ తెలంగాణ స‌ర్కారు కార్మికుల సంక్షేమం కోసం ప‌నిచేయ‌కుండా ప‌ట్టుద‌ల‌కు పోయింది. దీంతో ఆర్టీసీ యూనియ‌న్లు కూడా స‌మ్మెవైపే మొగ్గు చూపారు. దీంతో బ‌స్సులు డిపోల‌కే ప‌రిమితం అయ్యాయి.


ఇక తెలంగాణ స‌ర్కారు స‌మ్మెపై క‌న్నెర్ర జేసింది. అయినా వెర‌వ‌ని కార్మికులు విధుల్లోకి రాలేదు. దీంతో తెలంగాణ స‌ర్కారు ఉద్యోగుల‌ను తొల‌గిస్తామ‌ని, వెంట‌నే విధుల్లో చేరాల‌ని హెచ్చ‌రించింది. అయినా ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌ని కార్మికులు ముందుకు రాలేదు. దీంతో స‌ర్కారు కార్మికుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదే త‌రుణంలో స‌మ్మెపై హైకోర్టులో పిటిష‌న్ దాఖాలైంది. పిటిష‌న్ విచారించిన హైకోర్టు తెలంగాణ స‌ర్కారు, ఆర్టీసీ యాజ‌మాన్యానికి నోటీసులు జారీ చేసింది.


ఇప్పుడు ఈరోజు విచార‌ణ జ‌రిపి తీర్పు వెలువ‌రించ‌నుంది. అయితే ఈ తీర్పు ఎవ‌రి ప‌క్షం వ‌స్తుందో ? అనే ఉత్కంఠ ఇప్పుడు అంద‌రిలో నెల‌కొంది. అయితే తీర్పు కార్మికుల ప‌క్షం వ‌స్తే ఏం చేయాలో స‌ర్కారు ఓ ప్లాన్‌ను సిద్దం చేసి ఉంచుకుంద‌ట‌.. అదే  తెలంగాణ స‌ర్కారు వైపుకు తీర్పు వ‌స్తే కార్మికుల ప‌రిస్థితి ఏమిటీ అనేది ఇక్క‌డ ఉత్కంఠ క‌లిగిస్తోంది. కొద్ది సేప‌ట్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: