కొంతమందికి సినిమా నటులపై ఇంకొంతమందికి రాజకీయ నాయకుల పై అభిమానం ఉండటం సహజమే . అయితే కొంతమంది అభిమానులు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటారు. ఇక్కడ ఓ అభిమాని  తనకు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా  చాటాడు. ఇక పవన్ కళ్యాణ్ కి  ఉన్న క్రేజ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోను... ఆయనకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. గెలిచినా ఓడిన పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉండే  వీరాభిమానులు ఎంతోమంది. 

 

 

 

 

 ఈ క్రమంలోనే ఓ వీరాభిమాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన శుభలేఖ లపై ఏకంగా పవన్ కళ్యాణ్ ఫోటో వేయించాడు. దేవుళ్ళ ఫోటోలు ఉండాల్సిన ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఫోటోలను వేయించాడు aa వ్యక్తి . ఇక శుభలేఖ కూడా జనసేన పార్టీ జండా రీతిలో డిజైన్ చేయించాడు. విశాఖ జిల్లాలో ఓ వీరాభిమాని ఇలా చేశాడు. విశాఖ జిల్లాకు చెందిన రాజేష్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. రాజేశ్వర్ రెడ్డి కి  అక్టోబర్ 13న హేమలత తో పెళ్లి నిశ్చయమైంది. 

 

 

 

 

 ఈ క్రమంలో  పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన రాజేష్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో తన పెళ్ళి శుభలేఖను  జనసేన జెండా రీతిలో  లో డిజైన్ చేయించాడు. ఇక శుభలేఖ వెనకాల దేవుళ్ళ ఫోటోలు ఉండాల్సిన దగ్గర జనసేన పార్టీ ఫోటో... పవన్ కళ్యాణ్ ఫోటోలు వేయించాడు. కాగా  విశాఖపట్నం లో జరగబోయే ఈ పెళ్లికి తమ బంధువులను స్నేహితులను పిలిచేందుకు ఈ వెడ్డింగ్  కార్డు రెడీ చేసాడు రాజేష్ రెడ్డి . కాగా  ఈ వెడ్డింగ్ కార్డు అందుకున్న ఒకరు వెడ్డింగ్ కార్డు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ గా మారింది. అయితే గతంలో కూడా తమ అభిమాన నాయకుడు హీరోలపై అభిమానాన్ని చాటు కోవడానికి చాలామంది ఇలా చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: