సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గారికి లేఖ రాయడం ద్వారా కింది కోర్టులో రవిప్రకాశ్‌కు బెయిల్‌ మంజూరు కాకుండా న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిలో జోక్యం చేసుకోవడం విజయసాయిరెడ్డి దురుద్దేశాలకు రుజువుగా ఉందని తెలుగుదేశం పార్టీ నేత కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. ఏదైనా ఉంటే కోర్టులో ఫైల్‌ చేయాలి తప్ప ఈరకంగా లేఖలు రాయడం న్యాయవ్యవస్థ సహజ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. భారతదేశ న్యాయవ్యవస్థ ఎన్నో పరీక్షలను తట్టుకుని నిలబడి న్యాయాన్ని బతికించిన వ్యవస్థ అని ఏ2 రెడ్డికి తెలియదని అన్నారు. 

జగన్‌ అక్రమ వ్యాపారాలను ఎండగట్టారనే కక్షతోనే రవిప్రకాశ్‌కు వ్యతిరేకంగా ఇలాంటి బ్లాక్‌మెయిల్‌ లేఖలు రాస్తున్నారు. రవిప్రకాశ్‌ తన తెలివితో, కష్టంతో టీవీ9ను ఆ స్థాయికి తెచ్చారు. రవిప్రకాశ్‌ సమస్య పాత, కొత్త యాజమాన్యాల మధ్య ట్రేడ్‌వార్‌. అందులో ఏ2 రెడ్డి రాజకీయ జోక్యమెందుకు? విజయసాయి లేఖ చూస్తే ఆయన ఆ టీవీకి స్లీపింగ్‌ పార్టనరా అనే అనుమానం కలుగకమానదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మనీలాండరింగ్‌, హవాలా మార్గంలో విదేశాలకు డబ్బు తరలించడం, సూట్‌కేసు కంపెనీలను సృష్టించడంలో విజయసాయిరెడ్డి, జగన్‌లు పీహెచ్‌డీ చేశారని ఎద్దేవా చేశారు. 


జగన్‌తో కలిసి దొంగలెక్కలు రాయడం వల్ల సీబీఐ విచారణ చేసి రూ.43 వేల కోట్లు అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించి ఛార్జిషీట్‌ వేయడమైంది. ఇందులో భాగంగా సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండేందుకు.. 16 నెలలు జైలు జీవితం విధించడమైనది. 11 సీబీఐ కేసుల్లో జగన్‌ ఏ1 ముద్దాయిగా ఉండగా.. విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్నారు. రవిప్రకాశ్‌పై ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీం కోర్టు సీజేకు లేఖ రాయడం దురుద్దేశపూర్వకమే. విజయసాయిరెడ్డి పుట్టుకే మనీలాండరింగ్‌, సూట్‌ కేసు కంపెనీలతో ప్రారంభమైంది. ప్రజలు నవ్వుకుంటారనే ఆలోచన కూడా లేకుండా.. 11 కేసుల్లో ఏ2 అయిన విజయసాయిరెడ్డి.. జర్నలిస్ట్‌, మీడియా నిర్మాతగా ఉన్న టీవీ9 రవి ప్రకాశ్‌ విషయంలో చర్యలు తీసుకోవాలని సుప్రీం సీజేకు లేఖ రాయడం బెయిల్‌ మంజూరు కాకుండా కోర్టును ప్రభావితం చేయాలనే కుట్ర లేఖ సారాంశంగా ఉన్నది. మనీలాండరింగ్‌లో సెర్బియా దేశంలో పట్టుబడి జైలులో ఉన్న వ్యక్తిని విడుదల చేయించడానికి విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా ఎంపీల బృందం విదేశాంగశాఖను కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి అవినీతి సామ్రాట్‌ రవిప్రకాశ్‌పై లేఖ రాయడం ప్రజల వివేకాన్ని తక్కువ అంచనా వేయడమేనని అయన తెలిపారు. 

ఆడిటర్స్‌ ఇచ్చిన సర్టిఫికెట్లు తారుమారు చేసి కంపెనీల విలువను పెంచి దోచుకున్నారు. ఏ2 రెడ్డి మానుపులేషన్స్‌తో ఆడిటర్‌ వృత్తికే కళంకం తెచ్చాడు. నీపై ఉన్న 420 కేసులు ఈ దేశంలో మరెవరిపై లేవు. అలాంటి వ్యక్తి టీవీ9 రవి ప్రకాశ్‌ విషయంలో ఈడీ దర్యాప్తు జరపాలని, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పడం కుట్రపూరితం కాక మరేమౌతుంది? అని కనకమేడల పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: