జియో .. ఒక సంచలనం. డిజిటల్ ఇండియా కావడానికి ఒకరకంగా సహాయ పడిన నెట్‌వర్క్‌ ఇది. దాదాపు ఒకటిన్నర సంవత్సరం ఫ్రీ వాయిస్, ఫ్రీ డేటా, ఫ్రీ మెసెజ్ ఆఫర్ ఇచ్చింది. ఆ కాలంలో వన్ జిబి డేటా కొనాలంటే 150 రూపాయిలు ఖర్చు చెయ్యాల్సి వచ్చేది . ఇంకా అలాంటిది వాయిస్ కాల్స్ కి అయితే నెల జీతాన్ని పెట్టాల్సి వచ్చేది.  


ఇంకా చెప్పాలంటే అప్పట్లో స్మార్ట్ ఫోన్ కొనాలంటే బెదిరిపోయేవారు. సెల్ ధర చూసి కాదు అది అలవాటు అయితే నెలకు వచ్చే ఫోన్ బిల్ చూసి. అలాంటి సమయంలో జియో వచ్చి సామాన్యులకు కూడా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఒకటిన్నర సంవత్సరం ఫ్రీ సర్వీస్ అయిపోయాక డేటా, కాల్స్, మెసెజ్ సర్వీస్ కావాలంటే మూడు నెలలకు ఒకసారి నాలుగు వందల రూపాయిలు రీఛార్జ్ చెయ్యండి అని అంటే.. 


ఉన్నిలే.. సిగ్నల్స్ బాగా వస్తున్నాయి. దూసుకుపోదాం అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంబానీకి ఎం అయ్యిందో ఏమో ఉన్నట్టుండి కాల్స్ ఫ్రీ కాదు .. జియో టూ జియో అయితే ఫ్రీ.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయబోతున్నట్టు ప్రకటించి ఖాతాదారులకు షాక్ ఇచ్చింది రిలియన్స్ జియో. 


అయితే షాక్ నుంచి ఖాతాదారులకు ఊరట కల్పించేందుకు రిలయన్స్ జియో మరో తీపి కబురు చెప్పింది. 30 నిమిషాల ఉచిత టాక్‌ టైమ్‌ను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సమాచారం ‘ఎకనమిక్ టైమ్స్’ దినపత్రికలో ప్రచురితమైంది. ఖాతాదారులను కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 


తొలిసారి రీచార్జ్ చేయించుకున్న ఖాతాదారులకు 30 నిమిషాల ఉచిత టాక్‌టైం ఇవ్వనున్నట్టు జియో పేర్కొంది. రీచార్జ్ ప్లాన్లు ప్రకటించిన తొలి వారం రోజులు మాత్రమే ఈ వన్-టైమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కాగా, ఇంటర్‌కనెక్ట్ ఫీజును రద్దు చేసే వరకు ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసే ఖాతాదారుల నుంచి నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని జియో పేర్కొంది. 


అయితే ఒకప్పుడు జియో ఏదైనా షాక్ ఇవ్వాలన్న, శుభవార్త చెప్పాలన్న కనీసం రెండు నెలలు సమయం తీసుకునే రిలియన్స్ సంస్ద నిర్ణయం తీసుకున్న ఒక్క రోజులోనే అమలు చేసి ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఏది ఏమైనా ఈ వార్త ఖాతాదారులకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: