వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాయోగ్యమైన ఎన్నో పధకాలు రూపొందించారు.  ఒక్కో పధకం ఒక్కొక్కరిగా ఉపయోగపడుతున్నది.  అన్నింటికంటే ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి శభాష్అనిపించుకున్నారు.  అంతేకాదు, మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ మరో అడుగు ముందుకు వేశారు.  అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పిన జగన్ దానికి తగ్గట్టుగానే చేస్తున్నారు.  


మద్యం అమ్మకాలను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది.  ప్రభుత్వ విక్రమ దుకాణాల్లో కొంత పరిమితి వరకు మద్యం అమ్ముతుంది.  అంతకు మించి అమ్మడానికి సిద్ధంగా లేదు.  అలానే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర పధకాలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి.  ఇవన్నీ వేరే విషయాలు అనుకోండి.  అసలు విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి జగన్ ను మెగాస్టార్ చిరంజీవి రేపు మీట్ కాబోతున్నారు.  


అమరావతిలో జగన్ ఇంట్లో ఈ భేటీ జరగబోతున్నది.  రేపు మధ్యాహ్నం సమయంలో జగన్ ను ముఖ్యమంత్రి చిరంజీవి కలవబోతున్నారు.  చిరంజీవితో పాటు హీరో, నిర్మాత రామ్ చరణ్ కూడా వస్తున్నారు.  జగన్ ను కలిసి తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి సినిమాను చూడాలని కోరబోతున్నారు.  అలానే జగన్ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆయన్ను కలవలేదు.  


జగన్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పబోతున్నారు.  జగన్ ఇంట్లో కలుస్తున్నారు కాబట్టి జగన్ రేపు మెగాస్టార్ చిరంజీవికి తన ఇంట్లో విందు ఇవ్వబోతున్నారట.  మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లతో పాటుగా గంటా శ్రీనివాసరావు కూడా వెళ్తున్నారని తెలుస్తోంది.  గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.  అయన తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలోకి వెళ్లాలని చూస్తున్నారు.  కానీ, వైఎస్ జగన్ పార్టీలోకి చేర్చుకునే క్రమంలో ఆలోచిస్తున్నారు.  రేపు జరిగే మీటింగ్ లో ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: