ఈ బంగారం ధరకు ఎం అవుతుందో ఏంటో.. రోజుకో రకంగా మారుతుంది. ఈరోజు తగ్గింది అని అనుకునే సరి రేపు మళ్ళి పెరుగుతుంది. పసిడి ప్రియులకు షాక్ మీద షాక్ తింటూనే ఉన్నారు. నిన్న ధర తగ్గింది నేడు ధర భారీగా పెరిగింది. బంగారం ధర పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తుంది.  

                    

నేడు హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరుగుదలతో రూ.39,760కు చేరింది. అంతర్జాతీయంగా ట్రెండ్ బలిహీనంగా ఉన్న జువెల్లర్ నుంచి బారి డిమాండ్ ఉండటంతో బంగారం ధర పెరిగిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 

                    

ఈ నేపథ్యంలోనే 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.60 పెరుగుదలతో ధర రూ.36,440కు చేరింది. పసిడి ధర పరిగెత్తినప్పటికీ వెండి ధర మాత్రం పెరగం అపి తగ్గడం మొదలు పెట్టింది. కేజీ వెండి ధర రూ.50 తగ్గుదలతో రూ.48,550కు చేరింది. దేశ రాజధానిలో కూడా బంగారం పరిస్థితి ఇలానే ఉంది. 

                    

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరుగుదలతో రూ.38,250కు చేరగా, 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.37,200కు చేరింది. ఇకపోతే అమరావతి, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే మార్కెట్ నిపుణులు రేపు బంగారం ధర భారీగా తగ్గనుంది అని అంటున్నారు. మరి ఎం అవుతుందో చూడాలి. 

                   

మరింత సమాచారం తెలుసుకోండి: