తెలంగాణ ఆర్టీసీల సమ్మె ఉధృతం అవుతున్న నేపథ్యంలో సమ్మెను అణచివేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్టీసీ కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేసింది.


టి.ఎస్.ఆర్టీసీలో బస్సులు నడపడానికి గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులను డ్రైవర్, కండక్టర్లుగా ఎంపిక చేసి డ్రైవర్ అభ్యర్థులకు రోజుకు రూ.1500 చొప్పున, కండక్టర్ అభ్యర్థులకు రోజుకు రూ.1000 చొప్పున పారితోషికం సంస్థ అందిస్తోంది. ఇంకా అదనంగా డ్రైవర్, కండక్టర్లను తీసుకోవడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడమవుతుంది.


ఈ క్రమంలో రోజు వారీ పారితోషిక పద్దతిన రిటైర్డ్ ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్‌కు రూ.1500, ఇతర విభాగాల్లో పని చేసేందుకు గానూ అంటే మెకానిక్స్, శ్రామిక్స్, ఎలక్ట్రిషన్స్, టైర్ మెకానిక్స్, క్లరికల్ సిబ్బంది మరియు ఇతర ఏ విభాగాలకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులకు గాను రోజుకు రూ.1000 చొప్పున వేతనం ఇవ్వడం జరుగుతుందని ఆర్టీసీ యాజమాన్యం తన నోటిఫికేషన్‌ లో తెలిపింది. అలాగే ఓల్వో ఏసీ మల్టీ యాక్సిల్స్ పై అనుభవం ఉన్న డ్రైవర్స్, మెకానిక్ లకు రోజుకు రూ.2000 చొప్పున,


ఇతర ప్రభుత్వ శాఖల్లోని డ్రైవర్ లకు రోజుకు రూ.1500, ఇతర శాఖలో మెకానిక్స్ గా గానీ, రవాణాకు సంబంధించిన అనుభవం ఉన్న వారికి రోజుకు రూ.1000 చొప్పున ఇవ్వబడుతుందని తెలిపింది. సాఫ్ట్ వేర్ నిపుణులకు ఐటి ట్రైనర్ గా రోజుకు రూ.1500 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్లు, జిల్లా రవాణా అధికారులను సంప్రదించగలరని టీ ఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ పేరిట నోటిఫికేషన్ వెలువడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: