ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. మావూ జిల్లా మొహ్మదాబాద్ పరిధిలోని వలీద్ పూర్ లో గ్యాస్ సిలిండర్ పేలటంతో రెండతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడగా 10 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. పోలీసులు శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గ్యాస్ సిలిండర్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. అధికారులు తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది. 
 
గ్యాస్ సిలిండర్ పేలటంతో ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. వైద్యులు ప్రమాదంలో గాయపడిన వారికి తగిన చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర  గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. 
 
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. రెస్క్యూ టీం శిథిలాలను తొలగించటానికి ప్రయత్నాలు చేస్తోంది. సీఎం ఆదేశాలతో కలెక్టర్, ఎస్పీ మెడికల్ హెల్ప్ మరియు ఇతర సహాయ సహకారాల కొరకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదం జరగటానికి గల కారణాలు పోలీసుల విచారణ తరువాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: