ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. అయితే నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు. దీంతో నిన్న ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. 

                 

అయితే శ్రీనివాస్ రెడ్డి మృతితో నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు నిన్న అఖిలపక్షం పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అసలు ఖమ్మం జిల్లాలో బస్సులు నడవకుండా పూర్తిగా బంద్ చేశారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ జేఏసీ బంద్ పిలుపునకు రాజకీయ, ప్రజాసంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. 

                     

అయితే నిన్న డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ఆర్టీసీ కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో మాట్లాడకుండా ప్రస్తుతం సమ్మె చేసే కార్మికుల స్థానాలలో తాత్కాలిక ఆర్టీసీ కార్మికుల నియామకని ఉత్తర్వులు జారీ చేశారు. 

                          

మరో వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెని, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యను ప్రతిపక్షాలు రాజకీయంగా ఉపోయోగించుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం వల్ల అటు ఆర్టీసీ కార్మికుల వల్ల పిల్లల బడులు తెరవడం లేదు.. మరో పక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సమ్మోకు ముగింపు ఎప్పుడు చెప్తారో చూడాలి. 

                         

మరింత సమాచారం తెలుసుకోండి: