ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఇప్పటికే  ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బిజెపి సమ్మెకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వరకు కార్మికుల పక్షాన  పోరాడుతామని ప్రతిపక్ష పార్టీలన్నీ స్పష్టం చేసాయి . అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ప్రభుత్వం మొండి వైఖరి వీడటం  లేదు. దింతో  ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు అందరిని  ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో  ఆర్టీసీ కార్మికులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మనస్థాపం చెంది  బలవన్మరణాలకు పాల్పడుతున్నారు కార్మికులు . 

 

 

 

 

 ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె పై   టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు హుజూర్నగర్ ఉప ఎన్నిక పై పడే అవకాశముంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టిఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది కానీ మొదటిసారి ఉప ఎన్నికల్లో సిపిఐ పార్టీ మద్దతును కోరింది  టిఆర్ఎస్ పార్టీ. సీపీఐ పార్టీకి కాస్త ఓటు  బ్యాంకు ఉండడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ ఆలోచన  చేసింది. ఈ క్రమంలో సిపిఐ పార్టీ కూడా టిఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. దీంతో హుజూర్ నగర్  ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరింది. 

 

 

 

 

 అయితే తాజాగా ఆర్టీసీ సమ్మె  విషయంలో టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు హుజుర్  నగర్  ఉప ఎన్నిక మీద పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్ తీరును గమనిస్తున్న ప్రజలు గమనిస్తుండటంతో  టీఅర్ఎస్ కి బ్యాంకు తగ్గే  అవకాశం ఉందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన కామ్రేడ్ల పార్టీ... టిఆర్ఎస్ కు ప్రకటించిన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సిపిఐ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఆర్టీసీ కార్మికుల విషయంలో  టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు నిరసనగా మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు  వెల్లడించారు. అయితే ఎవరికి మద్దతు ప్రకటించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. అయితే సిపిఐ మద్దతు ఉపసంహరించుకోవడంతో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: