రాజకీయం చేయాలే కానీ ఒకరిని మించిన వారు మరొకరు ఉంటారు. దీన్నే తాడి తన్నేవాడిని తలదన్నేవాడు ఉన్నాడు అంటారు. రాజకీయాల్లో ఇండస్ట్రీలు గొప్ప కాదు. ఎపుడు వచ్చామన్న దానికంటే బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఇక్కడ  ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ విధంగా చూసుకుంటే అందరికంటే నాలుగాకులు ఎక్కువే చదివారు జగన్ అంటున్నారు.


వైసీపీ అధినేత నుంచి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగానే జగన్ మెదడు పాదరసంలా పనిచేస్తోందని అంటున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరు మీద జగన్ ఇస్తున్న మొత్తాన్ని 12,500 నుంచి 13,500 ల రూపాయలకు ఒక్కసారి పెంచారు. ఇది తెలివైన నిర్ణయం. అంతే కాదు, మూడు విడతలుగా ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు కూడా సర్కార్ ప్రణాళిక రూపొందించింది. మే నేలలో 7,500, ఖరీఫ్ సీజన్లో మరో నాలుగు వేలు, ఇక సంక్రాంతి వేళ రెండు వేల రూపాయలు. ఇలా మూడు సీజన్లూ జగన్ని తలచుకునేలా రైతు భరోసా బాగా ప్లాన్ చేశారు.


అంతే కాదు. మొదట నాలుగు ఏళ్ళ పాటు ఇస్తామన్నసర్కార్  ఇపుడు అయిదేళ్ళూ రైతుకు భరోసా ఇస్తామని, అండగా ఉంటామని చెప్పుకొచ్చింది. వీటన్నిటి కంటే కూడా మరో పొలిటికల్ మూమెంట్ ఏంటంటే వైఎస్సార్ రైతు భరోసాలో కేంద్రం వాట ఆరు వేల రూపాయలు ఉన్నందువల్ల  వైఎస్సార్  రైతు భరోసా పీఎం కిసాన్ యోజన అంటూ కేంద్రం పేరుని కూడా తగిలిచడంతో ఇక బీజేపీ కిక్కురుమనే పరిస్థితి లేదు.


అదే సమయంలో రైతులకు ఇన్ని విధాలుగా అండగా ఉంటూ పధకం రూపుదిద్దడమే కాదు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు  కూడా అర్హత ఉంటే ఈ పధకాన్ని పొందవచ్చు అని రూల్స్ సడలించడం ద్వారా   టీడీపీకి పెద్ద దెబ్బే కొట్టేసారు జగన్. సో   రైతు భరోసాతో పొలిటికల్ పార్టీల  మైండ్ బ్లాకే మరి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: