జియోనే ఒక సంచలనం.. మళ్ళి సంచలన ప్రకటన ఏంటి అని అనుకుంటున్నారా ? ఉంది అండి. నాలుగు రోజుల క్రితం జియో ఓ సంచలన ప్రకటన చేసింది. అదే తమ ఖాతాదారుల నుంచి రిలయన్స్ జియో నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. 


దీంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా నెటవర్క్లు సోషల్ మీడియా ద్వారా జియోపై వరుసగా విమర్శలు చెయ్యడం మొదలు పెట్టాయి. దీంతో జియోకు తిక్క రేగి డైరెక్ట్ గా ట్విట్లతో ఎటాక్ చెయ్యడం మొదలు పెట్టింది. ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ రంగులలోనే జిఓ ఇమేజ్ లు చేసి ట్విట్లు చెయ్యడం ప్రారంభించింది. 


జియో ట్విట్ చేస్తూ ఆ ఆరు పైసలను తాము వసూలు చేయడం లేదని, వారే వసూలు చేస్తున్నారని తేల్చి చెప్పింది. టెలికం నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నట్టు జియో వివరణ ఇచ్చింది. కాగా ప్రత్యర్థి నెటవర్క్లకు జియో అల్టిమాటే షాక్ ఇచ్చింది.   


ఐడియాకు షాక్ ఇస్తూ ''జీరో ఐయూసీ, ఈ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది'' అని కామెంట్ పెట్టి ‘‘నిమిషానికి 6 పైసలు, ఈ ఐడియా ఎందుకు సర్జీ'' అని ఆ సంస్థ రంగులోనే ఇమేజ్‌ని పెట్టి ట్వీట్ చేసింది. అలాగే, ‘ఎయిర్ టోల్’ అంటూ ఎయిర్‌టెల్‌పైనా, ‘హ్యాపీ టు చార్జ్’ అంటూ వొడాఫోన్‌‌పైనా జియో విరుచుకుపడింది. అయితే ఇలా ట్విట్ చేసినప్పుడు కొంతమనేది వినియోగదారులు నేను ఎయిర్టెల్ కి పోర్ట్ పెట్టుకుంటా, వోడాఫోన్ కి పోర్ట్ పెట్టుకుంటా అన్న సమయంలో ఎయిర్టెల్ స్పందిస్తూ వెంటనే మీ నెంబర్ పర్సనల్ గా పెట్టండి మేము మార్చేస్తాం అని ట్విట్ పెట్టింది. దీంతో మరో వినియోగదారుడు రిప్లై ఇస్తూ 'నేను సిగ్నల్స్ రావటం లేదు అని కంప్లైంట్ ఇచ్చి నెల అవుతుంది అది సెట్ చెయ్యి ఫస్ట్' అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్లు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: