తెలుగు సినీ రంగంలో తిరుగులేని మెగాస్టార్ చిరంజీవి. ఆయన్ని అందరివాడు అంటారు. ఎవరినీ నొప్పించని మనస్తత్వం చిరంజీవిది. ఆయన మంచితనమే రాజకీయాలకు అడ్డుకట్టగా మారిందంటారు. చిరంజీవి ఓ విధంగా రాజకీయాలలో చూపించే కరకుదనం లేకపోవడం వల్లనే రాణించలేకపోయారని చెబుతారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీ రాజకీయాల్లో ఇపుడు సరికొత్త కోణాలు కనిపిస్తున్నాయి.


చిరంజీవి సైరా లాంటి మూవీ తీసిన తరువాత మరిన్ని సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఆయన ఇపుడు  రాజకీయాలకు దూరం అంటున్నారు. అయితే హఠాత్తుగా ఆయన ఏపీ సీఎం జగన్ని  కలుసుకోవడం మాత్రం తెలుగు రాజకీయాల్లోనే సంచలనం రేపిందని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి కేవలం నటుడు మాత్రమే  కాదు. ఆయన ప్రజారాజ్యం పార్టీ స్రుష్టికర్త. కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకుడు. ఎంపీ, ఎమ్మెల్యెగా కొన్నేళ్ళ పాటు రాజాకీయాల్లో ఉన్నారు. పైగా ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కూడా ఇపుడు రాజకీయాల్లో ఉన్నారు. ఇవన్నీ చూసుకున్నపుడు ఈ కలయిక మర్యాదపూర్వకం అని ఎంతలా కొట్టిపారేసినా పొలిటికల్ స్పెక్యులేషన్లు  జోరుగా ఉంటాయి


ఇక చిరంజీవి జగన్ని కలసి వచ్చిన తరువాత ఓ కుటుంబంతో కలసి విందారగించిన అనుభూతి పొందానని స్వయంగా చెప్పుకున్నారు. అంటే జగన్ ఆతిధ్యం మెగాస్టార్ ని బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇది తనకు గౌరవం అని కూడా అన్నారు. అదే విధంగా జగన్ దంపతులు మెగాస్టార్ దంపతులకు ఇచ్చిన మర్యాద మన్నన కూడా చర్చనీయాంశంగా  ఉన్నాయి.కారు దాకా వచ్చి మరీ జగన్ దంపతులు మెగాస్టార్ ఫ్యామిలీని సాగనంపారు ఈ అప్యాయత ఇంతటితో ఆగేలా లేదని కూడా అంటున్నారు. ఓ విధంగా మెగాస్టార్ అన్నీ ఆలోచించుకునే జగన్ తో భేటీకి వచ్చారని కూడా అంటున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో పవన్ జగన్ వైపు రారు. ఆయన ఉంటే గింటే బాబుతోనే  ఉంటారు. 


ఈ నేపధ్యంలో జగన్ వైపునకు చిరంజీవి రావడం అంటే అన్నయ్య, తమ్ముడి రూట్లు వేరు అన్నట్లుగానే ఇప్పటివరకూ చూస్తే అనిపిస్తోంది. రాజకీయంగా ఇప్పటికైతే పెద్దగా చర్చకు ఆస్కారం లేకపోయినా జగన్ పట్ల చిరంజీవికి ఏర్పడిన సాఫ్ట్ కార్న్ రానున్న రోజుల్లో తెలుగునాట సరికొత్త పాలిటిక్స్ కేంద్రం అవుతుందా అన్నది కూడా ఆలోచించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: