ప్రభుత్వ పథకాల్లో మానవీయత ఉండాలి..ఇదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మార్కు. ఇప్పుడు ఆ మార్కు ఆయన కుమారుడు వైఎస్ జగన్ కూడా కొనసాగిస్తున్నారు. రైతు భరోసా పథకం నిబంధనలే ఇందుకు ఉదాహరణ. గతంలో ఈ పథకం కింద లబ్ది పొందుతున్న రైతులు చనిపోతే ఈ సాయం ఆగిపోయేది. ఆ భూమి రైతు పేరు నుంచి ఆయన వారసుల పేరుకు ఎక్కిన తర్వాతే సొమ్ము వచ్చేది.


కానీ జగన్ ఈసారి కొత్త నిబంధన తెచ్చారు. ప్రస్తుతం దాదాపు 1.37 లక్షల మంది రైతులు రైతుభరోసా పథకానికి అర్హత ఉండి చనిపోయినట్లుగా తేలింది. అలాంటి రైతుల భార్యలకు సాయం అందించాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయంతో దాదాపు లక్షన్నర మంది వితంతువులు లబ్ది పొందుతారు.


అసలే భర్త మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతువులు కాగితాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని తప్పింది. అందుకే ఈ వితంతువుల పాలిట జగన్ దేవుడుగానే చెప్పుకోవాలి. అంతే కాదు.. పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి.. లేదా మరొక ఉద్యోగం చేసుకుంటుంటే ఆ తల్లిదండ్రులు గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేసుకుంటే అలాంటి వారిని దీన్ని నుంచి మినహాయించవద్దని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సూచించారు.


అంతే కాదు.. ప్రస్తుతం 40 లక్షల మందికి రైతు భరోసా పెట్టుబడి సాయం అందుతుంది. ఇంకా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోలేదు. డేటా సరిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి గడువు పెంచాలని చెప్పగానే నెలరోజుల పాటు పథకానికి సీఎం వైయస్‌ జగన్‌ గడువు పెంచారు. నవంబర్‌ 15వ తేదీ వరకు అర్హత కలిగిన రైతులు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా గ్రామ సచివాలయాల్లో, ఎమ్మార్వో, ఎండీఓ, కలెక్టర్‌ కార్యాలయాల్లో డిస్‌ప్లే చేయమని సీఎం ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: