ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు భూమా అఖిలప్రియ నిన్న ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ తన భర్త పరారీపై, ఆమె రాజకీయ జీవితం గురించి, వైసీపీ పార్టీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అఖిల ప్రియ. తన భర్తపై కావాలనే కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించింది. 


వ్యాపార భాగస్వామిపై అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ దాడికి పాల్పడ్డాడు అని కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో అయనపై కేసు నమోదు ఆయన విషయం విదితమే. అయితే అదే సమయంలో భార్గవ్ రామ్ పై హైదరాబాద్ లోను పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో భార్గవ్ రామ్ గత 10 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. 


అయితే ఈ కేసుల విషయంపై అఖిల ప్రియ మాట్లాడుతూ తన భర్తపై కావాలనే కేసులు పెడుతున్నారని.. ఆ కేసులలో నిజం ఎంత మాత్రం లేదని.. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసాని.. కానీ వారు కూడా రాజకీయ నేతలకు బయపడి తలొగ్గుతున్నారని ఆమె చెప్పింది.  


అయితే ఈ విషయంపై ఆమెని యాంకర్ ప్రశ్నించగా.. తన భర్త కేసుల వెనుక చాలామంది ఉన్నారని.. అది వైసీపీ కావచ్చు. పోలీసులు కావచ్చు.. అని ఆమె ఆరోపించారు. జగన్ పర్మిషన్ లేకుండా ఇంత చిన్న కేసుకు ఎస్సై కు ఎస్పీ ఫోన్ చేసి కేసులు పెట్టమని చెప్పడం వంటివి ప్రభుత్వమే వెనుక ఉండి నడిపిస్తుందని.. ఇది అంత కూడా ఆమె పులివెందులకు వెళ్ళి రావడం వల్లే జరిగి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా భార్గవ్ రామ్ ఏ తప్పు చెయ్యకపోతే అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం లేదని.. ఎప్పుడు తప్పు చేసే వాళ్ళు అలానే దైర్యంగా ఉంటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: