2016 నవంబర్ 8 వ తేదీన ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారు.  పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఒకసారిగా ఒక్కసారిగా ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొన్నది.  వేంటనే దాని నుంచి బయటపడేందుకు ఆర్బిఐ కొత్త రెండువేల నోటు, ఐదు వందల నోట్లను ప్రింట్ చేసింది.  దీంతో ఆర్ధిక వ్యవస్థ గాడిన పడింది.  అయితే, రెండువేల నోటు చలామణి కొంతకాలమే ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.  దీనిపై అనేక విశ్లేషణలు కూడా వచ్చాయి.  


2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ. 2 వేల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లను ముద్రించింది. ఆ ముద్రణ 2018-19 సంవత్సరానికి వచ్చే సరికి 46.690 మిలియన్ నోట్లకు చేరింది.  అయితే, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఒక్క రెండువేల నోటును కూడా ఆర్బీఐ ముద్రించలేదు.  ఇప్పటి వరకు చలామణిలో ఉన్న నోట్లను అలానే ఉంచేసింది.  


రెండువేల నోట్లు ముద్రించకపోవడానికి కారణం ఉన్నది.  రెండువేల రూపాయల నకిలీ నోట్లను పాక్ ముద్రిస్తోందని, ఆ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చి ఉగ్రవాదులకోసం ఉపయోగిస్తున్నట్టు ఇండియన్ ఇంటిలిజెన్స్ వర్గాలు చెప్పాయి.  దీంతో ఈ నోట్లను ప్రింట్ చేయడం ఆపేసింది.  ఇక ఈ మూడేళ్ళ కాలంలోనే దాదాపుగా రూ. 50 కోట్ల రూపాయల నకిలీ రెండువేల నోట్లను పట్టుకున్నారు.  


ఇప్పుడు రెండువేల నోట్ల ప్రింటింగ్ ను ఆపేయడంతో ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.  మరలా రెండువేల నోటును రద్దుచేసి.. ఇబ్బందుల్లో పెడతారేమో అని  భయపడుతున్నారు.  ఇప్పుడు రెండువేల నోటును ఎవరికి ఇచ్చినా తీసుకోవడం లేదు.  500 లేదా వంద నోట్లు ఉంటె ఇవ్వమని అంటున్నారు.  ప్రభుత్వం మాత్రం రెండువేల నోట్లను బ్యాన్ చేయలేదని, ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశ్యం లేదని అంటోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: