ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువకుడే కానీ, రాజకీయాల్లో మాత్రం ఆరితేరిన అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలకు కూడా మింగుడుపడని వ్యూహాలు అమలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించిన విశ్లేషకులు ఈ అభిప్రాయానికి వస్తున్నారు. ఇకపోతే అమరావతి వెనుక పెద్ద స్కాం ఉందని, చంద్రబాబు తన అనుయాయులకు వందలాది ఎకరాలు కట్టబెట్టి, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా ముందే కొనుగోలు చేసి.. ఆ తర్వాత రాజధానిని ప్రకటించారంటూ ఇప్పటికే ప్రజల్లో పెద్దగా టాక్ వుంది..


అంతే కాకుండా బాబు చేసిన అవినీతి పనులు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ దశలో రెండు సార్లు టీడీపికే మద్దతిచ్చిన జనసేనాని ఇప్పుడు జరుగుతున్న అభివృద్దిని మరచి, జగన్ మీద మాటి మాటికి ఫోకస్ చేయడం సమంజసమా. ఇదే కాకుండా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పాలనపై అధ్యయనం చేసేందుకు పార్టీ నేతలు, నిపుణులతో కొద్దిరోజుల క్రితం కమిటీ వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అదే కమిటీని ఒక్కసారి గతంలోకి తీసుకెళ్లి బాబుగారి పాలనలో జరిగిన అభివృద్దిని, అవినీతిని కూడా పరిశీలించి ప్రజలకు వివరిస్తే మంచిది.


ఇప్పటికే టీడీపీకి ఏజెంట్ అనే ముద్రను ప్రజల్లో బలంగా  ముద్రించుకున్న పవన్ కళ్యాణ్ ఇకనైన నిజా నిజాలు ఆలోచించి అడుగేస్తే మేలని,రాజకీయంగా ఎదగాలంటే విమర్శించడం ఒక్కటే మార్గం కాదని, చేసే విమర్శల్లో బలం ఉండాలని ఎన్నో కొత్త కొత్త పధకాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లుతూ, ప్రతి పేదవాడి కడుపు నిండాలని, కంటినిండా నిదురించాలని, అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల గుండెల్లో సుస్దిరస్దానాన్ని పొందుతున్న జగన్ పాలనలోని నిజాయితీని చూసి మాట్లాడాలని వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ కు హితబోధ చేస్తున్నారట. ఇక ఇప్పటికైనా బాబుగారి జపం మాని ఏపి రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలోని ప్రజలకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే విషయంలో తమవంతుగా ఆలోచిస్తూ అడుగేస్తే బాగుంటుందంటున్నారట పవన్ కళ్యాణ్ తీరును దగ్గరగా గమనిస్తున్న కొందరు నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: