తెలంగాణ ప్ర‌భుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బ‌లు పెద్ద కొత్త విష‌యం ఏం కాదు. ఆ మాట‌కొస్తే...ఏప్ర‌భుత్వానికి అయినా కూడా కొత్త కాదు. కానీ..ప‌రిమిత స‌మ‌యం విధించి...క్లిష్ట‌మైన స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌డం అంటే...నిజంగా ఇబ్బందే క‌దా? ఇప్పుడు అదే ప‌రిస్థితుల్లో తెలంగాణ ప్ర‌భుత్వం ఉంది. ర్టీసీ సమ్మెను విరమిం చేలా ఆర్డర్‌ ఇవ్వాలంటూ ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ సుబేం దర్‌సింగ్‌ వేసిన పిల్‌ను మంగళవారం హైకోర్టు సీజే జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ సంద ర్భంగా ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యూనియన్లను ఉద్దేశించి పట్టుదలకు పోతే వచ్చే నష్టం మీకు కాదని, ఎర్రబ స్సెక్కే ప్రజలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మంటలు మండుతుంటే చలి కాచుకునే తరహాలో ఉండకూడదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది.ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలు జరుపాలని, ప్రభుత్వం కూడా రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చర్చలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు సూచించింది.


కార్మికసంఘాల డిమాండ్లలో ఒకటైన ఆర్టీసీకి ఎండీ నియామకంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం.. ఎండీని తాత్కాలికంగా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించింది. శాశ్వత ప్రాతిపదికన ఎండీని నియమించాలని సూచించింది. ఎండీ నియామకానికి నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆర్టీసీకి శాశ్వత ప్రాతిపదికన ఎండీని వెంటనే నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. లోకాయుక్త, ఉప లోకాయుక్త నియామకాలపై కూడా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేసింది. విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని ఏఏజీ జే రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. 


విచారణ సందర్భంగా అదనపు ఏజీ కల్పించుకుని 2015లో ప్రభుత్వం ఆర్టీసీ ఆదాయంలో 44 శాతాన్ని ఫిట్‌మెంట్‌ ఇచ్చామని చెప్పగానే ఎప్పుడో చేసింది కాదని, ఇప్పుడు ఏం చేశారో చెప్పాలని హైకోర్టు కోరింది. ఆర్టీసి సమ్మె ప్రభావం ఏమీ లేదని, ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఏజీ బిఎస్‌ ప్రసాద్‌ చెప్పడంతో హైకోర్టు అసంతప్తి వ్యక్తం చేసింది. ఇబ్బందులే లేవన్నప్పుడు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు పొడిగింపు ఉత్తర్వులు ఎందుకిచ్చారని, ఇంకా 3 నుంచి 4 వేల బస్సులు నడవాలన్నప్పుడు ప్రయాణీకులకు ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఎట్లా ఉంటాయని హైకోర్టు ప్రశ్నించింది.
యూనియన్లు, ప్రభుత్వం పంతాలు వీడాలని, సమ్మె విరమించాలని, తర్వాత ప్రభుత్వం చర్చలు జరపాలని, ఏం చేశారో 18న జరిగే విచారణ సమయంలో చెప్పాలని హైకోర్టు కోరింది. ఇదే సమయంలో జీతాలు ఇచ్చేలా ఆర్టీసీ యాజ మాన్యానికి ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ వేసిన రిట్‌, దసరా సెలవుల్ని ప్రభుత్వం పొడిగించడాన్ని రద్దు చేయాలని తల్లిదండ్రుల సంఘం వేసిన మరో రిట్‌ను గురువారం హైకోర్టు సింగిల్‌ జడ్జిల దగ్గరకు విచారణకు వచ్చాయి. వీటిపై వాదనలు నేడు జ‌ర‌గ‌నున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: