పిల్లలపై తల్లిదండ్రులకు ఎలాంటి ప్రేమ ఉంటుందో చెప్పక్కర్లేదు.  పిల్లలు జీవితంలో ఎదగాలని కోరుకుంటారు.  వారి భవిష్యత్తు బాగుండాలని అనుకుంటారు.  అందరిలాగానే ఆ తల్లి దండ్రులు కూడా కొడుకును చదివించారు.  మంచి ఉద్యోగంలో చేర్పించారు.  నెలకు 60 వేలరూపాయల వరకు జీతం.  ఆంతా సవ్యంగా సాగిపోతున్నది.  హమ్మయ్య అనుకున్నారు.  కానీ, అదే సమయంలో తెలియకుండానే కొన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి.  సడెన్ ఆ కొడుకు సన్యాసంలో చేరిపోయాడు.  దీంతో ఆ తల్లిదండ్రులు షాక్ అయ్యారు.  


కొడుకు ఉద్యోగాన్ని వదిలిపెట్టి స్వచ్చంద సంస్థలో చేరి ప్రసంగాలు చేస్తున్నారు.  అలా సన్యసించి ప్రసంగాలు చేస్తూనే నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్నారట.  కానీ, ఆ తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు.  పిల్లవాడు చేతికొస్తే.. జీవితం హ్యాపీగా ఉంటుంది అనుకుంటే.. దానికి వ్యతిరేకంగా జరగడంతో పాపం ఇబ్బందులు పడ్డారు.  చేసేది లేక కోర్టులో కేసు ఫైల్ చేశారు.  


కోర్టు పాపం ఆ తల్లిదండ్రుల మాటలు విన్నది.  వారి వాదనలు విన్న కోర్టు వాళ్లకు ప్రతి నెల రూ. 10వేలరూపాయలు చెల్లించాలని కొడుకును ఆదేశించింది.  అయితే, కోర్టు తీర్పుపై తల్లిదండ్రులు అసంతృప్తితో ఉన్నారు. తన కొడుకు నుంచి నెలకు కనీసం రూ. 50వేలరూపాయలు చెల్లించామని కోర్టు చెప్తుందేమో అనుకుంటే కేవలం రూ. 10వేలరూపాయలు చెల్లించమని చెప్పడంతో.. పాపం ఆ తల్లిదండ్రులు నిరాశ చెందారు. 

తల్లిదండ్రులు పిల్లలపై ఆశలు పెట్టుకోవడం సహజమే. చేతికి వచ్చాక తమ బాధ్యతలు తీసుకుంటారేమో అని చాలామంది  ఎదురు చూస్తుంటారు.  కానీ, అలా జరగకపోవడంతో ఆ తల్లిదండ్రులు పడే బాధలు అన్ని ఇన్ని కాదు. దీనావస్థలో అనాధ శరణాలయంలో దిక్కులేకుండా ఉంటున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు.  వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఎంతలా బాధపడుతున్నారో చెప్పక్కర్లేదు.  చిన్నప్పటి నుంచి పిల్లలను సక్రమమైన మార్గంలో నడిచే విధంగా బోధనలు చేస్తే.. పెద్దయ్యాక పిల్లలు మంచి మార్గంలో నడుస్తారు.  లేదంటే ఇక అంతే. 


మరింత సమాచారం తెలుసుకోండి: