2020 జనవరి నెల నుండి హైదరాబాద్ నగరంలో నివసించే వారికి కొత్త పన్నులు అమలు కాబోతున్నాయి. హైదరాబాద్ నగర పాలక సంస్థ నగరంలోని కట్టడాలు, నిర్మితమై ఉన్న భవనాల గురించి పూర్తిగా సర్వే చేసి చెల్లించాల్సిన పన్ను కన్నా తక్కువ పన్ను చెల్లిస్తున్న వారిని గుర్తించటం కొరకు సిద్ధమైంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1వ తేదీ నుండి నగరపాలక సంస్థ సర్వే మొదలుపెట్టనుంది. 
 
నగరపాలక సంస్థ అధికారులు డిసెంబర్ నెల చివరి వారంలోపు సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1400 కోట్ల రూపాయల ఆదాయం గత ఆర్థిక సంవత్సరానికి హైదరాబాద్ మహా నగర పాలక సంస్థకు చేకూరింది. సర్వే పూర్తయిన తరువాత నగర పాలక సంస్థ ఆదాయాన్ని 2,000 కోట్ల రూపాయలకు చేర్చడమే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 20 లక్షలకు పైగా నిర్మాణాలు ఉన్నాయి. 
 
కానీ నగర పాలక సంస్థకు కేవలం 14.5 కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. నగరంలోని చాలామంది ప్రజలు పెంచుకున్న విస్తీర్ణానికి మరియు అదనపు అంతస్తులకు పన్ను చెల్లించకుండా కాలం గడిపేస్తున్నారు. నగరంలోని కొందరు కేవలం నివాసానికి అనుమతి తీసుకొని నివాస పన్ను కడుతూ నివాసాలలో వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు నివాసాలలో గోడౌన్లు, కాలేజీలు, హాస్పిటళ్లు మరియు స్కూళ్లు నిర్వహిస్తున్నారు. 
 
ప్రజల వినియోగానికి తగిన విధంగా పన్ను విధించాలని అధికారులు సర్వే చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుసోంది. ఫీల్డ్ ఆఫీసర్లు ఇప్పటికే నగరంలో వినియోగానికి తగిన విధంగా పన్ను కట్టని వారిని గుర్తించినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ముడుపులు తీసుకొని ఖజానాకు గండి కొట్టారని ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ప్రస్తుతం శాటిలైట్ ద్వారా డాకెట్లు ఉపయోగించి దోషాలు తలెత్తిన జూబ్లీహిల్స్, కూకట్ పల్లిలోని డాకెట్ల వివరాలను సరిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. డాకెట్ల తప్పులను సరిదిద్దిన తరువాత నవంబర్ 1వ తేదీ నుండి సర్వే ప్రారంభం అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: