టీడీపీ పార్టీ  ప్రజాప్రతినిధిగా అనువజ్ఞుడైన రాజకీయ నేతగా పేరున్న ఓ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఓ ఎమ్మెల్యే వ్యవహరం చంద్రబాబును ఆలోచన లో పడేశాయి. ఒక పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎలా మరోపార్టీ ఎంపీ పుట్టిన రోజు వేడుకలకు పోతారని చంద్రబాబు ఉడికిపోతున్నారు. ఇంతకీ ఎమ్మెల్యే ఎవరో ఇపుడు చూద్దాం.

ప్రకాశం జిల్లాకు చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జరుపుకున్న పుట్టిన రోజు వేడుకలకు అదే జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ పాల్గొని అందరికి షాక్ ఇచ్చారు. తనతో పాటు తన కుమారుడు వెంకటేశ్ ను కూడా వెంట బెట్టుకుని ఈ వేడుకలకు వెళ్ళారు. అంటే తన రాజకీయ వారసుడిగా ఉన్న కొడుకును కూడా ఈ పార్టీకి తీసుకురావడంతో రాజకీయ వేడి రాజుకుంది. కరణం బలరామ్ తన కుమారుడిని వైసీపీలో చేర్చే ఆలోచనలో ఉన్నారని.,, అందుకే వైసీపీ ఎంపీ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారనే చర్చ జోరుగా జరుగుతుంది.

ఈ పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కరణం బలరాం., శ్రీనివాసులు రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో చివరి దాకా ఉండటం!!. ఎంపీని పొగడ్తలతో ముంచెత్తడం!!. ఎంపీకి శాలువా కప్పి సన్మానించడం!!. చూసి ఇతను పార్టీ మారె అవకాశం ఉన్నదని పబ్లిక్ సందేహం. కానీ., ఎంపీ పుట్టిన రోజు వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే పాల్గొనడంలో ఎలాంటి రాజకీయ మార్పు లేదని కేవలం సన్నిహితుడు కావడంతోనే పుట్టిన రోజు వేడుకలకు వెళ్ళాడని టీడీపీ వాళ్లు చెపుతున్నారు. ఇక బలరాం మాగుంట కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి స్నేహితులే. గత ఎన్నికలకు ముందు కూడా వీరిద్దరు టీడీపీలో ఎమ్మెల్సీలుగా పని చేశారు.. అందుకే అంత స్నేహం అయి ఉండవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి: