సమైక్య  రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ జరగని విచిత్రమైన విషయం ఇపుడు ఏపిలో జరిగింది. అదేమిటంటే పోలీసు అధికారుల సంఘం తెలుగుదేశంపార్టీ పై విరుచుకుపడుతోంది. ఒక విధంగా టిడిపి నేతలపై పోలీసు అధికారుల సంఘం రివర్స్ ఎటాక్ చేస్తున్నట్లే లెక్క. పోలీసు అధికారుల సంఘం నుండి ఇటువంటి రివర్స్ ఎటాక్ ను ఊహించని చంద్రబాబునాయుడు అండ్ కో బిత్తరపోతున్నారు.

 

ఒక్క చంద్రబాబు తప్ప ఇంకెవరు ప్రతిపక్షంలో  ఉన్నా పోలీసు శాఖతో పెద్దగా పెట్టుకోరు. చంద్రబాబుకున్న అలవాటు ఏమిటంటే అధికారంలో ఉన్నంత కాలం పోలీసు శాఖను అడ్డుగోలుగా వాడేసుకుంటారు. డిజిపి నుండి హోం గార్డు స్ధాయి వరకూ ప్రతి ఒక్కరు తన తన ముందు  సిండికేట్ బ్యాంకు సింబల్ అనే అనుకుంటారు.

 

ఖర్మకాలి ప్రతిపక్షంలోకి వచ్చారో లేదో వెంటనే బెదిరింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు మొదలుపెట్టేశారు. దాంతో పోలీసులకు మండిపోయింది. చంద్రబాబు ఒక్కరే అంటే పోలీసులు కూడా ఏదోలే అని సర్దుకుని పోయేవారేమో. చంద్రబాబు అండ చూసుకుని వర్ల రామయ్య లాంటి నేతలు కూడా పోలీసులపై రెచ్చిపోతున్నారు.

 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం వైఎస్ కుటుంబసభ్యులే హత్య చేశారంటూ చంద్రబాబు అండ్ కో ఎన్నోసార్లు ఆరోపించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నారు. దాంతో పోలీసులు టిడిపి నేతలపై ఫుల్లుగా ఫైర్ అయిపోతున్నారు.

 

ఆధారాలు లేకుండా మాట్లాడేస్తున్న నేతలకు నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. వర్ల రామయ్యకు నోటీసులు సర్వ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదని పోలీసు అధికారుల సంఘం నేతలు వర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రేపే మాపో చంద్రబాబుకు కూడా నోటిసులు వెళతాయంటున్నారు.

 

నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన చర్యలు తీసుకుంటామని స్వయంగా డిజిపి సవాంగే హెచ్చరించారంటే పరిస్ధితిని టిడిపి నేతలు ఎంత స్ధాయికి తెచ్చుకున్నారో అర్ధమైపోవటం లేదూ.

 


మరింత సమాచారం తెలుసుకోండి: