హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచా రానికి ఈనెల 19 సాయంత్రంతో తెరపడనుంది. 21న పోలింగ్ ని ర్వ‌హించి, 24న ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. అయితే ప్ర‌చారానికి రెండు రోజులు మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో ఈ కొద్ది స‌మ‌యాన్ని స‌మ‌ర్థంగా స‌ద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీలు సిద్ధ మ‌వుతున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. చివరగా ముఖ్య నేతలను ప్రచారానికి దింపుతున్నాయి. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాజరవుతున్నారు. 18, 19 తేదీల్లో టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రోడ్డు షో ఖరారైంది.


చాలాకాలం త‌ర్వాత తెలంగాణలో ఒంట‌రిగా బ‌రిలోకి దిగిన టీడీపీ హుజూర్‌న‌గ‌ర్‌లో త‌మ బ‌లాన్ని ప రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది. ఆ పార్టీ అభ్య‌ర్థి చావా కిర‌ణ్మ‌యి ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌తో స‌మానంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ర‌మ‌ణ ప్ర‌చారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌ను తీసుకువ‌చ్చి, పార్టీ శ్రేణుల్లో నూత‌నోత్సాహాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రో ప‌క్క మొద‌ట్లో స్త‌బ్ధుగా క‌నిపించిన‌ప్ప‌టికీ, చివ‌ర్లో బీజేపీ దూకుడు పెంచింది.


రాష్ట్రంలోని ఎంపీలు, సీనియ‌ర్ నేత‌ల‌తో ఆపార్టీ ప్ర‌చారం నిర్వ‌హించింది. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి కూడా శుక్ర‌వారం ప‌లు మండ‌లాల్లో రోడ్‌షో నిర్వ‌హించేందుకు రెడీ అవుతున్నారు. ఇక తెలంగాణ ఇంటి పార్టీ మ‌ద్ద‌తుతో స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మ‌ల్ల‌న్న ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. అంతేగాక సోష‌ల్ మీడియా వేదిక‌గా అధికార పార్టీపై విమ‌ర్శ‌లు సందిస్తూ... త‌న‌కు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకుంటున్నారు.


అయితే హుజూర్‌న‌గ‌ర్‌లో ప్ర‌ధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ మ‌ధ్యే ఉంటుంద‌ని అంతా భావిస్తుండ‌గా, టీడీపీ, బీజేపీతోపాటు స్వ‌తంత్య్ర‌ అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న రోడ్డు రోలర్ గుర్తు అభ్య‌ర్థి చీల్చే ఓట్ల‌తో ఎవ‌రికి న‌ష్టం జ‌రుగుతుందో అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయా అభ్య‌ర్థుల‌కు పోల‌య్యే ఓట్లు ...  కాంగ్రెస్‌, టీఆర్ ఎస్‌లో ఎవ‌రికి న‌ష్టం క‌లిగిస్తాయ‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. దీంతో ఈ రెండు ప్ర‌ధాన పార్టీల్లో టెన్ష‌న్ నెల‌కొంది. ఆయా పార్టీలు, స్వ‌తంత్ర అభ్య‌ర్థి చీల్చే ఓట్ల‌పైనే త‌మ గెలుపోట‌ములు ఆధార‌ప‌డి ఉండొచ్చ‌ని వారు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: