ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి తరువాత ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు పార్టీని వీడి వివిధ పార్టీల్లో చేరిపోయారు.  ముఖ్యంగా బీజేపీలోకి టిడిపినుంచి వలసలు ఎక్కువయ్యాయి. టిడిపి నుంచి మరికొంతమంది నేతలు కూడా టీడీపీ నుంచి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  ఈ సమయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించబోతున్నది.  ఈ పొలిట్ బ్యూరోలో కొత్తగా ముగ్గురికి చోటు కల్పించారు.  


గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, వర్ల కు చోటు కల్పించారు. కాగా, ఈరోజు ఉదయం సమావేశం జరగబోతున్నది.  మొత్తం 13 అంశాలపై చర్చలు జరుపుతున్నారు.  ఈ 13 అంశాలలో మెయిన్ గా చర్చకు రాబోతున్న అంశాలు ఏమిటంటే.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలను ఈ ప్రభుత్వం నిలిపివేసిన వాటిపైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపైనా అక్రమంగా కేసులు పెట్టడంపైనా చర్చించబోతున్నారు.  


గత ప్రభుత్వం హయాంలో అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టింది.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాలా పధకాలను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధులు కేటాయించడం ఆపేసింది.  ఆ పధకాలను పక్కన పెట్టి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్త పధకాలు ప్రవేశపెట్టడంతో వీటిపై పొలిట్ బ్యూరోసమావేశంలో చర్చించబోతున్నారు.  అంతేకాకుండా, తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైనా అక్రమంగా కేసులు పెడుతున్నారు.  


ఈ కేసులు పెట్టడమే కాకుండా వారిపై దాడులు కూడా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు వాపోతున్నారు.  దీనిపై కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.  సమావేశంలో ముందుగా కోడెలకు నివాళులు అర్పిస్తారట.  ఆ తరువాత సమావేశం ప్రారంభం అవుతుంది.  మొత్తం 13 అంశాలు ఈ సమావేశంలో చర్చకు రాబోతున్నాయి.  వీటిపై చర్చించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: