హుజూర్ నగర్ ఉపఎన్నికలకు సమయం దగ్గర పడింది.  అక్టోబర్ 21 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది.  ఈ ఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి.   ప్రచారాన్ని వేగం చేస్తున్నాయి.  ఈ ప్రచారంలో అన్ని పార్టీలు తమ  అభ్యర్థుల తరపున ప్రచారం చేసుకుంటున్నారు.  కాగా, ఈరోజు ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా హుజూర్ నగర్లో ప్రచారం చేయబోతున్నారు.  హుజూర్ నగర్ అభివృద్ధి కోసం అయన వరాలు ఇవ్వబోతున్నారు.  


ఇప్పుడు అందరి దృష్టి కెసిఆర్ ప్రచారం మీదనే ఉన్నది.  కెసిఆర్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు.  ఎలా ప్రచారం చేయబోతున్నారు. అని ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు వరకు హుజూర్ నగర్ తెరాస కు అనుకూలంగా ఉందని, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన తరువాత అక్కడి పరిస్థితులు క్రమంగా మారిపోయాయని విశ్లేషకులు అంటున్నారు.  


ఈ ఎన్నికల్లో తెరాస పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. హుజూర్ నగర్ లో తామే తిరిగి గెలుస్తామని, హుజూర్ నగర్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉందని, ఎంపీ నిధులతో నియోజకా వర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.  అయితే, నియోజక వర్గం అభివృద్ధి చెందాలి అంటే తెరాస కు ఓటు వేయాలని, తెరాస పార్టీని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెరాస పార్టీ నేతలు అంటున్నారు.  


అయితే, కాంగ్రెస్.. తెరాస పార్టీలు చేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ, బీజేపీలు ప్రచారం చేయడం లేదు.  అక్కడి లోకల్ లీడర్లే ప్రచారం చేస్తున్నారు.  బీజేపీ ఈ విషయంలో ఓ స్టాండ్ ను ప్రదర్శిస్తోంది.  ప్రజలు నిజంగా ఎవరికి ఓటు వేయాలి అనుకుంటే వాళ్లకు ఓటు వేస్తారని, వాళ్ళను బలవంతం చేయలేమని అంటున్నారు. హుజూర్ నగర్ లో తమకు బలం ఉందని, ఆ బలంతో తప్పకుండా విజయం సాధిస్తామని అంటోంది బీజేపీ. అటు తెలుగుదేశం పార్టీ కూడా తమకు తగినట్టుగా ప్రచారం చేస్తున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: