ఈ కాలం పిల్లల్ని ఏ విషయంలో ఆపతరం కాదు. అంతేకాదు నువ్వు అలావుండు, ఇలా సమాజంలో నడుచుకో అని చెప్పేవారిని బద్దశత్రువుల్లా చూస్తారు. మా ఇష్టాలు మావి. మా స్వేచ్చ మాది మాకు నచ్చినట్లు జీవిస్తాం అంటు సమాధానం ఇస్తారు. అలా అని పద్దతిగా కూడ ఉండటం లేదు. ఆ అలవాట్లే ఒక్కోసారి ప్రాణాలకు అపాయంగా మారుతున్నాయి. అందుకు ఉదాహరణగా ఇక్కడ జరిగిన సంఘటనే సాక్ష్యం అని చెప్పవచ్చూ. ఇంతకు ఏం జరిగిందంటే


తమిళనాడులోని సేలంలోని ఇడైపట్టి విద్యాజోన్ కు చెందిన ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులలో ఒక విద్యార్థిని పుట్టిన రోజు. సందర్భంగా  గుట్టుచప్పుడు కాకుండా క్లాస్ రూంలో కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు. అలాగే చేసారు కూడా  కానీ.. ఆ గ్రూపులోని ఒక అమ్మాయి తనతో పాటు బీరు బాటిల్ క్లాస్ రూం కు తీసుకొచ్చింది. అది చూసిన మిగతా విద్యార్ధులు ఒక్క సారిగా షాక్ తిన్న, ఆ వెంటనే తేరుకొని ఉత్సాహంగా బీరుబాటిల్‌తో ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఇంతలో అనుకోకుండా ఈ సీన్ మొత్తం  స్కూల్ టీచర్ కంట్లో పడింది.


వెంటనే సదరు అమ్మాయిల తల్లిదండ్రుల్ని స్కూలుకు పిలిపించి జరిగింది చెప్పి, ఇలాంటి పనులు చేయడం సరికాదని మందలించారు. ఆ మాటలకు మనస్తాపం చెందిన సదరు  బీరు బాటిల్ తెచ్చిన అమ్మాయి ఇంటికి వెళ్లిన కాసేపటికే సూసైడ్ చేసుకుని మృతి చెందింది. కుమార్తె చేసిన పనికి షాక్ తిన్న ఆ తల్లిదండ్రులు. ఈ విషయం బయటకు పొక్కితే తమ పరువు పోతుందని భావించి,  కుమార్తె సూసైడ్ చేసుకున్న ఉదంతాన్ని బంధువులకు, మిత్రులకు, దగ్గర వారికి సైతం చెప్పకుండానే అంత్యక్రియలు పూర్తి చేశారట. ఈ సమాచారం ఆనోట ఈ నోట  పోలీసులకు అందటంతో వారు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. చూసారుగా ఉత్సాహం మంచిదే..కానీ అత్యుత్సాహం తో చేసే పని కొన్ని కొన్ని సమయాల్లో అనుకోని చిక్కులను తెచ్చి పెడుతుంది. చివరకు ప్రాణాలు కూడ తీస్తుంది ఇలాగా..


మరింత సమాచారం తెలుసుకోండి: