గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ వర్షాలు కురవడం లేదు.  హమ్మయ్య అంతా బాగుందిలే అనుకున్నారు.  హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి కెసిఆర్ అన్ని సిద్ధం చేసుకున్నారు.  ఈరోజు మధ్యాహ్నం హుజూర్ నగర్లో బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉన్నది.  హుజూర్ నగర్ ఉపఎన్నికను తెరాస పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  కేడర్ మొత్తం అక్కడే ఉండి ప్రచారం చేస్తోంది.  ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తుండటం తెరాస పార్టీకి తీరని నష్టాన్ని తీసుకొచ్చే విధంగా ఉన్నది.  


అందుకే కెసిఆర్ రంగంలోకి దిగి అక్కడ ప్రచారం చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.  కానీ, సడెన్ గా ఈ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.  ఇలా భారీ వర్షం కురవడంతో కెసిఆర్ సభను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.  కెసిఆర్ వచ్చి ఉంటె.. పార్టీకి కొంతమేర లాభం జరిగేది.  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆ నియోజక వర్గానికి ప్రభుత్వం చేయబోతున్న అభివృద్ధి పనులు గురించి ప్రస్తావించే అవకాశం ఉండేది. 


ఒక్క హుజూర్ నగర్ నియోజక వర్గం మాత్రమే కాకూండా, తెలంగాణలో అభివృద్ధి గురించి, ప్రభుతం తీసుకుంటున్న చర్యల గురించి పధకాల గురించి కెసిఆర్ తప్పకుండా ఈ సభలో ప్రస్తావించేవారు.  విచిత్రం ఏమిటంటే...ఈ సభ రద్దు కావడం.  సభ రద్దు కావడం వలన తెరాస పార్టీకి లాభమా నష్టమా అంటే చెప్పలేని పరిస్థితి.  ఒకవైపు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.  కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసు.  


హైకోర్టు కూడా ప్రభుత్వాన్నీ ఇబ్బందుల్లో పెడుతున్నది.  జీతాలు ఇవ్వాలని, కార్మికులతో చర్చలు జరపాలని అంటోంది.  కానీ, నిన్నటి రోజున కెసిఆర్ సమావేశం తరువాత కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ సమ్మె వలన ఆర్టీసీకి రూ. 150 కోట్ల రూపాలకు పైగా నష్టం వచ్చిందని, కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.  ఇది జరిగిన తరువాత హుజూర్ నగర్ లో సమ్మె జరుగుతుండటంతో.. సమ్మె జరిగే ప్రాంతంలో కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే.. బ్యాడ్ అవుతుంది. ఒక రకంగా సభ రద్దు కావడమా మంచిదే అని కొందరు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: