రాజకీయంలో మాటలకి ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. తమ మాటల ద్వారా ప్రజలని తమ వైపుకు లాక్కుంటేనే వాళ్ళు నాయకులుగా ఎదుగుతారు. సరిగా మాట్లాడటం రాని వారు రాజకీయ నాయకులు కాలేరు. ప్రస్తుతం వైసీపీలో మాట్లాడేవాళ్ళు లేకుండా పోయారు. ఎన్నికలకి ముందు పార్టీలో యాక్టివేట్ గా ఉంటూ, తమ మాటల ద్వారా జనాలని ప్రభావితం చేయగలిగిన వారిలో రోజా, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.


ఎన్నికలకి ముందు వీరు ముగ్గురు మీడియాలో ఎక్కువగ కనిపించేవారు. ప్రతీ డిబేట్లలోనూ తమ గొంతుక వినిపించి తమ బలం చూపించేవారు. వీరిద్దరి వల్ల మీడియాలో వైసీపీకి ఎక్కువ ప్రచారం లభించిందన్నది వాస్తవం. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు మీడియాలో అస్సలు కనిపించట్లేదు. టివి డిబేట్లలోనూ వీరి జాడే లేదు. ఇంతకుముందు యాక్టివ్ గా పనిచేసిన ఈ ఇద్దరు మీడియాలో అస్సలు కనిపించక పోవడానికి కారణాలు ఏమై ఉంటాయని ఆలోచిస్తున్నారు.


అయితే ఇక్కడ రెండు కారణాలు ప్రథమంగా కనిపిస్తున్నాయి. రోజా ఎమ్మేల్యేగా గెలిచాక ఆమెకి మంత్రి పదవి వస్తుందని ఆశించింది. కానీ అలా జరగలేదు. దాంతో ఆమె అసంతృప్తి చెందారని వినబడడంతో ఏపీఐఐసీ పదవిని ఇచ్చి కట్టబెట్టారు. ఇక వాసిరెడ్డి పద్మ గారు ఎమ్మేల్సీ పదవిని ఆశిస్తే ఆమెకి మహిళా కమీషన్ పదవిని ఇచ్చారు. ఈ ఇద్దరూ తమకి కావాల్సిన పదవి రాలేదన్న ఆవేదనతో ఇలా చేస్తున్నారేమోనని అంటున్నారు.


వీరు లేకపోవడం వల్ల అవతలి వాళ్ళకి వైసీపీ నాయకులు సరిగ్గా సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. ద అందువల్ల వైసీపీ నాయకులతో టివి డిబేట్లు చాలా చప్పగా సాగిపోతున్నాయి. మరి ఇకనైనా వారి పంతం వీడి యాక్టివ్ అయ్యి మీడియాలో మునుపటి జోష్ కనబరిచి తమ గొంతుని వినిపించి నాయకుడికి అండగా ఉంటారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: