ఏపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 50 శాతం పైగా ప్రజల మద్దతుతో ఎన్నికలలో విజయం సాధించిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అండదండలతో నడిచే పత్రికలు వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని కట్టుకథనాలు, విషం చిమ్మే వార్తలు రాస్తున్నాయని అన్నారు. తప్పుడు వార్తలు రాస్తున్నా ప్రతి పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని అన్నారు. 
 
సీఎం జగన్ జనవరి నెల నుండి ఉద్యోగ క్యాలెండర్ అమలు చేస్తానని చెప్పాడని అన్నారు. 1,34,918 గ్రామ సచివాలయ ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ఎక్కడైనా పేపర్ లీకైన ఆధారం ఉందా...? ఇదేనా నిజమైన జర్నలిజం..? అని మంత్రి ప్రశ్నించారు. ఊహించుకొని, ఊహాజనితమైన, విషం చిమ్మే వార్తలు రాసి అదే జర్నలిజం అని ఉద్దేశపూర్వకంగా ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్తలు రాశారని అన్నారు. 
 
ఆర్టీసీ బస్సుల కొనుగోలు గురించి ఇంకా ఆలోచనలు చేస్తున్నామని ఏ పద్దతిలో బస్సులు కొనుగోలు చేయాలో కొన్ని గైడ్ లైన్స్ నీతి అయోగ్ పంపించిందని చెప్పారు. ఆర్టీసీ ఎండీపై రివర్స్ వేటు అంటూ తప్పుడు కథనం ఆంధ్రజ్యోతి పత్రిక రాసిందని అన్నారు. ప్రభుత్వం నుండి వివరణ కోరి రాయాల్సిన అవసరం ఉందా? లేదా? అని మంత్రి ప్రశ్నించారు. ఇదేనా మీరు చెప్పిన పావురాయి కథలు అని అన్నారు. 
 
మా అక్షరం మీ ఆయుధం అని అన్నప్పుడు మా అక్షరం కూడా వేయాలి కదా అని అన్నారు. ఈర్ష్య, పగ, ద్వేషం ఎందుకని పేర్ని నాని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి రాసిన కథనాల్ని మంత్రి పేర్ని నాని తీవ్రంగా తప్పుబట్టారు. ఓర్వలేక ఇలాంటి రాతలు రాస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆంధ్రజ్యోతి మాత్రం వార్తల కవరేజీకి అనుమతించకుండా మా వెర్షన్ తీసుకోవటం లేదని మంత్రి చెబుతున్నారని అంటోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: