జగన్ సర్కార్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. విశాఖ భూ కుంభకోణాలపీన సమగ్ర విచారణ జరిపించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో మూడేళ్ల క్రితం జరిగిన భూ దందా అంతా ఇంతా కాదు. అందులో అధికార పార్టీ పెద్దల ప్రమేయం ఉందని వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు సర్కార్ కూడా సిట్ నియమించింది.


అయితే ఆ సిట్ నివేదిక ఏంటో ఇప్పటివరకూ బయటపెట్టలేదు. విశాఖ భూ కుంభకోణంలో మాజీ మంత్రి ఒకరుతో పాటు, పలువురు అప్పటి ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో  ఉన్నారని కూడా గట్టిగా ప్రచారం సాగింది. అయితే నాడు టీడీపీ తప్ప అన్ని పార్టీలు ఏకమై విచారణ కోరిన నేపధ్యంలో చంద్రబాబు సర్కార్ సిట్ ని నియమించింది. సిట్ చాలా నెలలు శోధించి సేకరించిన సమాచారాన్ని సమగ్ర నివేదిక రూపంలో బాబు ప్రభుత్వానికి అందించింది. అయితే చంద్రబాబు సర్కార్ ఆ నివేదికను బుట్టదాఖలు చేసింది.


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సహా అందరికీ క్లీన్ చీటి ఇచ్చేసింది. దీని మీద గంటా సైతం సిట్ నివేదిక ఇచ్చిందని, తన తప్పు లేదని కూడా చెప్పుకున్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు. సిట్ నివేదిక బహిరంగపరచమని ఆ నివేదికలో డిమాండ్ కూడా చేసారు. ఈ పరిణామాలు ఇలా ఉండగానే పాత సిట్ ని పక్కన పెట్టి మరో సిట్ ని జగన్ సర్కార్ నియమించింది.


ఈ సిట్ విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయకుమార్ నేత్రుత్వం వహిస్తారు. విశాఖలో భూ ఆక్రమణలు,  ప్రభుత్వ భూముల అన్యాక్రాంతమైన ఈ సిట్ విచారణ చేస్తుంది. ఇందులో సభ్యులుగా వైవి అనూరాధ, టి భాస్కరరావుల‌ను ప్రభుత్వం నియమించింది.  సిట్ కి మూడు నెలల గడువును కూడా ప్రభుత్వం ఇచ్చింది. మొత్తానికి జగన్ సర్కార్ సిట్ నియామకం చేయడంతో విశాఖలో రాజకీయ ప్రకంపనలు చెలేరేగుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: