కేసీయార్ సర్కార్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అన్నీ బాగానే ఉంటే ఒకే కానీ. తేడా కొట్టిందో ఒకదాని తరువాత మరొకటి అలా చికాకులు వస్తూనే ఉంటాయి. ఇపుడు కేసీయార్  ప్రభుత్వం ఓ వైపు పులి మీద స్వారీ చేస్తోంది. ఆ పులి అలాంటిది ఇలాంటిది కాదు, దిగితే  ఏం చేస్తుందో తెలియదు, దిగకపోయినా నరకమే. 


అటువంటి పరిస్థితులు కేసీయార్ సర్కార్ ఎదుర్కొంటోంది. యాభై వేల మంది ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకు వచ్చి గత పదిహేను రోజులుగా సమ్మె బాట పట్టారు. వారి సమస్యను ప్రభుత్వం అలా ఉంచేసింది. దాంతో సమ్మెకు మద్దతు రోజు రోజుకు సమ్మెకు పెరుగుతోంది. తెలంగాణా ఉద్యోగులు సైతం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచారు ఇదిలా ఉండగా ఇపుడు మరో కొత్త సమస్య వచ్చిపడింది.


అదేంటి అంటే క్యాబ్స్ బంద్. ఈ నెల 19 నుంచి తెలంగాణావ్యాప్తంగా ఉన్న యాభైవేల మంది క్యాబ్ డ్రైవర్లు సమ్మె బాట పట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణా టాక్సీ డ్రైవర్ల జేయేసీ   ప్రకటించింది.  తమ సమస్యల పరిష్కారం కోసం  గత ఆగస్ట్ 30న  ప్రభుత్వానికి లేఖ అందించగా ఇప్పటివరకూ స్పందన లేదని జేయేసీ నేతలు ఆరోపించారు. అందుకే సమ్మెకు దిగుతున్నట్లుగా కూడా ప్రకటించారు.


ఈ పరిణామంతో  ఇపుడు ఐటీ కంపెనీల్లో ఆందోళన వ్యక్తం అయింది. ఇదిలా ఉండగా ఓ వైపు బస్సుల సమ్మె, మరో వైపు క్యాబ్ డ్రైవర్ల ఆందోళన, ఇంకోవైపు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఈ విషమ పరిస్థితుల్లో కేసీయార్ సర్కార్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని అంటున్నారు. కేసీయార్ సర్కార్ వరసగా వస్తున్న ఈ సమస్యలను, సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారో చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా ఇది గడ్డుకాలమే.




మరింత సమాచారం తెలుసుకోండి: